AP Night Curfew: ఏపీలో నేటి నుంచి తలపెట్టిన రాత్రి కర్ఫ్యూ వాయిదా పడింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సంక్రాంతి తర్వాత.. ఈనెల 18 నుంచి రాత్రి కర్ఫ్యూ అమలు చేయాలని నిర్ణయించింది. కర్ఫ్యూపై తొలుత ఇచ్చిన ఉత్తర్వుల్లో సవరణ చేస్తూ.. తాజాగా ఆదేశాలను జారీ చేసింది.
AP Night Curfew: ఏపీలో రాత్రి కర్ఫ్యూ అమలు వాయిదా - AP Night Curfew news
15:18 January 11
AP Night Curfew: ఏపీలో రాత్రి కర్ఫ్యూ అమలు వాయిదా
సంక్రాంతి పండుగ వేళ పల్లెలకు పెద్దఎత్తున ప్రజలు తరలివస్తున్నారని.. వారికి ఇబ్బందులు కలగకూడదనే కర్ఫ్యూ వాయిదా వేశామని ఏపీ వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని వెల్లడించారు. మూడోదశ వచ్చినా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు మాస్కులు ధరించాలన్న ఆయన.. ధరించకపోతే రూ.100 జరిమానా విధిస్తామని స్పష్టం చేశారు. కరోనా కట్టడిలో ప్రభుత్వానికి ప్రజలు సహకరించాలని కోరారు.
వాణిజ్య దుకాణాలు, మాల్స్ తదితర వాటిల్లో కొవిడ్ నిబంధనలు పాటించకపోతే రూ.10వేల నుంచి రూ.25వేల వరకు జరిమానా విధించాలని ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. సినిమా హాళ్లలో 50 శాతం మందికే అనుమతించింది. ఆర్టీసీ సహా ప్రజారవాణా వాహనాల్లో సిబ్బంది, ప్రయాణికులు తప్పనిసరిగా మాస్కు ధరించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇదీచూడండి:Kishan Reddy On Lockdown: సంక్రాంతి తరువాత లాక్డౌన్పై నిర్ణయం..