AP Three Capitals Bill: ప్రస్తుత శాసనసభ సమావేశాల్లోనే మూడు రాజధానులపై చర్చించి.. బిల్లును ప్రవేశ పెడతామని ఏపీ సీఎం జగన్ చెప్పారంటూ సోషల్ డెమోక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు మాదిగాని గుర్నాథం వెల్లడించారు. బాపట్ల ఎంపీ నందిగం సురేష్, 3 రాజధానుల శిబిరం నిర్వాహకులు, బహుజన పరిరక్షణ సమితి ఉద్యమ నాయకులు.. గురువారం వెలగపూడిలోని సచివాలయం వద్ద ముఖ్యమంత్రిని కలిశారు.
మళ్లీ తెరపైకి మూడు రాజధానులు.. ఈనెల 21న బిల్లు..? - jagan on ap three capitals bill
AP Three Capitals Bill: ఏపీలో మూడు రాజధానుల అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. కొంతమంది నేతలు.. ఇటీవల ముఖ్యమంత్రి జగన్ను కలిసి మూడు రాజధానుల బిల్లును మరోసారి అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని కోరినట్లు సమాచారం. దానిపై స్పందించి సీఎం జగన్ ఈనెల 21న బిల్లు ప్రవేశపెడతామని చెప్పినట్లు పలువురు చెబుతున్నారు.
ap three capitals bill
ఈ సందర్భంగా శాసనసభలో మూడు రాజధానుల బిల్లును మరోసారి ప్రవేశపెట్టాలని కోరుతూ సీఎం జగన్కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఈనెల 21న శాసనసభలో 3 రాజధానులపై చర్చించి, బిల్లు ప్రవేశ పెడతామని సీఎం చెప్పినట్లు గుర్నాథం వెల్లడించారు.
ఇదీచూడండి:దక్షిణాదిపై ఆప్ దృష్టి.. ఆరోజు నుంచే తెలంగాణలో కేజ్రీవాల్ పాదయాత్ర..?