తెలంగాణ

telangana

ETV Bharat / city

మహిళా పోలీసు విభాగం ఏర్పాటు.. నియామకాల్లో వాలంటీర్లకు అవకాశం - ఏపీ తాజా వార్తలు

women police wing in AP: మహిళా పోలీసు విభాగం ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఐదు కేటగిరీలుగా మహిళా పోలీసు విభాగంలో పోస్టులను విభజించినట్లు ప్రభుత్వం వెల్లడించింది.

ap women police breaking
ap women police breaking

By

Published : Jan 12, 2022, 10:35 PM IST

women police wing in AP: ఏపీలో మహిళా పోలీసు విభాగం ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. గ్రామ, వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శులను.. మహిళా పోలీసులుగా మార్పు చేస్తున్నట్లు పేర్కొంది. సర్వీసు నిబంధనలు, పోస్టుల కేటగిరీ అంశాలను ప్రకటించింది.

ఐదు కేటగిరీలుగా మహిళా పోలీసు విభాగంలో పోస్టులను విభజించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. నేరుగా నియామకాల ద్వారా 90 శాతం మహిళా పోలీసుల భర్తీ చేపడుతామని పేర్కొంది. ఐదు శాతం మహిళా హోంగార్డులను ఈ విభాగంలో భర్తీ చేస్తామని.. గ్రామ, వార్డు మహిళా వాలంటీర్ల నుంచి 5 శాతం మంది భర్తీలో అవకాశం ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details