ఆంధ్రప్రదేశ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ఎత్తివేస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. హైకోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వాలని కోరుతూ.. సర్వోన్నత న్యాయస్థానంలో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఇప్పటికే ఈ అంశంపై ఏబీ వెంకటేశ్వరరావు సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు. వాదనలు వినకుండా ఎలాంటి ఆదేశాలు ఇవ్వొద్దని కోరారు.
ఏపీ ఐపీఎస్ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ఎత్తేసిన హైకోర్టు
దేశ, రాష్ట్ర భద్రతా వ్యవహారాలను పక్కనబెట్టి దేశద్రోహానికి పాల్పడ్డారన్న ఆరోపణలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావును సర్వీసు నుంచి సస్పెండ్ చేసింది. కాగా.. హైకోర్టు సస్పెన్షన్ను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది.
ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ఎత్తివెత
దేశ, రాష్ట్ర భద్రతా వ్యవహారాలను పక్కనబెట్టి దేశద్రోహానికి పాల్పడ్డారని పేర్కొంటూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావును సర్వీసు నుంచి సస్పెండ్ చేసింది. దీనిపై ఆయన హైకోర్టును ఆశ్రయించగా.. ఏపీ ప్రభుత్వ ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది. తాజాగా ఈ ఉత్తర్వులపై ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది.
ఇద చదవండి:పాఠశాలల ప్రారంభంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు: విద్యాశాఖ