మరో అంశంలో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. అమరావతిలో ఇళ్ల స్థలాల పంపిణీ, ఆర్-5 జోన్‌పై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీం సమర్థించింది. ఏపీ హైకోర్టులో విచారణ సరిగ్గానే జరిగిందని సీజేఐ బొబ్డే అభిప్రాయపడ్డారు. హైకోర్టులో కేసు తుది విచారణ ముగించాలని సుప్రీం సూచించింది.
సుప్రీంకోర్టులో మరోసారి ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురు - Distribution of amaravathi housing spaces
![సుప్రీంకోర్టులో మరోసారి ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురు AP government Distribution of housing spaces, in the case of R5 zone issue support Supreme Court](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8447626-230-8447626-1597647015434.jpg)
11:32 August 17
సుప్రీంకోర్టులో మరోసారి ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురు
రాజధాని మాస్టర్ ప్లాన్‌లో మార్పులు చేస్తూ ఆర్-5 జోన్‌పై గతంలో ప్రభుత్వం ఉత్తర్వులివ్వగా.. విచారణ పూర్తయ్యే వరకూ వాటిని హైకోర్టు సస్పెండ్ చేసింది.
తాము రాజధాని కోసం భూ సమీకరణలో ఇళ్లు ఇస్తే... అక్కడ ఇతర ప్రాంతాల వారికి ఇళ్ల పట్టాలు ఇవ్వటాన్ని ప్రశ్నిస్తూ వెలగపూడికి చెందిన రైతులు హైకోర్టుని ఆశ్రయించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు కొట్టివేయంతో పాటు 60కి పైగా పేజీలతో తీర్పు వెలువరించింది. అయినప్పటికీ ప్రభుత్వం సుప్రింకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం .... రాజధాని మాస్టర్ ప్లాన్‌లో మార్పులు చేయటాన్ని తప్పుబడుతూ హైకోర్టు ఇచ్చిన తీర్పుని సమర్థించింది.
ఇదీ చూడండి :ఉప్పొంగుతున్న గోదావరి... భద్రాద్రిలో 60 అడుగులకు చేరిన నీటిమట్టం
TAGGED:
అమరావతిలో ఇళ్ల స్థలాల పంపిణీ