తెలుగు అకాడమీ పేరు మారుస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలుగు- సంస్కృత అకాడమీగా మార్పు చేస్తూ ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర ఉత్తర్వులు విడుదల చేశారు. అకాడమీ పాలకవర్గంలో పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శిని ఎక్స్ అఫీషియో సభ్యుడిగా నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.
ap telugu academy: ఏపీ తెలుగు అకాడమీ పేరు మార్పు.! - తెలుగు అకాడమీ పేరు తాజా వార్తలు
ఏపీలో తెలుగు అకాడమీ పేరు మారుస్తూ ఆ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న పేరును తెలుగు- సంస్కృత అకాడమీగా మార్చింది. అదేవిధంగా అకాడమీ పాలకవర్గంలో పలువురిని నియమించింది.
ఏపీ తెలుగు అకాడమీ
తెలుగు- సంస్కృత అకాడమీ యూజీసీ నామినీగా మురళీధర్‌శర్మ నియామకం అయ్యారు. తిరుపతిలోని జాతీయ సంస్కృత వర్సిటీ వైస్ ఛాన్సలర్‌గా మురళీధర్‌శర్మ పని చేస్తున్నారు. అకాడమీ పాలకవర్గ సభ్యులుగా ప్రొ. డి.భాస్కర్‌రెడ్డి, నేరెళ్ల రాజ్‌కుమార్, ఎం.విజయశ్రీ, కప్పగంతు రామకృష్ణను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ఇదీ చదవండి:Matsya Setu App : మత్స్యసంపద పెంపునకు ఆన్లైన్ కోర్సులు