ఆంధ్రప్రదేశ్లో తాడేపల్లి అత్యాచార(gang rape) బాధిత యువతికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 5 లక్షల పరిహారాన్ని(Ex Gratia) ప్రకటించింది. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ తరపున మరో 50 వేలు అందించనున్నట్లు మంత్రులు తానేటి వనిత(taneti vanitha), సుచరిత(sucharitha) వెల్లడించారు. గుంటూరు జీజీహెచ్లో చికిత్స పొందుతున్న బాధితురాలిని మంత్రులు పరామర్శించారు. వైద్యులను అడిగి ఆమె ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.
Ex Gratia: అత్యాచార బాధితురాలికి రూ.5 లక్షల పరిహారం - తాడేపల్లి అత్యాచార ఘటన తాజా వార్తలు
ఏపీలో తాడేపల్లి అత్యాచార ఘటనపై హోంమంత్రి సుచరిత(home minister sucharitha) ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు జీజీహెచ్లో మంత్రి తానేటి వనితతో కలిసి బాధితురాలిని పరామర్శించిన ఆమె..ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమన్నారు. బాధిత యువతికి ప్రభుత్వం రూ. 5 లక్షల పరిహారాన్ని (Ex Gratia) ప్రకటించిందని మంత్రి వెల్లడించారు.
అత్యాచార ఘటనపై ఆవేదన వ్యక్తం చేసిన హోంమంత్రి(home minister)..ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా ఇలాంటి ఘటనలు జరగటం దురదృష్టకరమన్నారు. ఘటన నిందితులను పట్టుకోవటానికి నాలుగు పోలీసు బృందాలను ఏర్పాటు చేశామన్నారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా కఠిన చర్యలు చేపడతామని వెల్లడించారు. దర్యాప్తు వేగవంతం చేసి దోషులకు శిక్షపడేలా చూస్తామని హోం మంత్రి చెప్పారు. ఇప్పటికే నాలుగు ఫోరెన్సెక్ ల్యాబ్లను ఏర్పాటు చేశామన్నారు.
ఇదీచదవండి:CM KCR:వరంగల్ గ్రామీణ, అర్బన్ జిల్లాలకు కొత్త పేర్లు: కేసీఆర్