తెలంగాణ

telangana

ETV Bharat / city

Lease cultivation: కౌలు సాగులో అగ్రస్థానంలో నిలిచిన ఏపీ

కౌలు సాగు (Lease cultivation)లో ఏపీ (AP) మొదటి స్థానంలో నిలిచింది. 2018 జులై నుంచి 2019 జూన్‌ మధ్య కేంద్ర గణాంకశాఖ నిర్వహించిన 77వ జాతీయ నమూనా సర్వే (National Sample Survey) లో ఈ విషయం వెల్లడైంది.

Lease cultivation: కౌలు సాగులో అగ్రస్థానంలో నిలిచిన ఏపీ
Lease cultivation: కౌలు సాగులో అగ్రస్థానంలో నిలిచిన ఏపీ

By

Published : Sep 20, 2021, 9:06 AM IST

కౌలు సాగులో ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రం (Andhra pradesh state) అగ్రస్థానంలో ఉంది. మొత్తం కమతాల్లో 42.4% కౌలు రైతుల కిందే ఉన్నాయి. మొత్తం విస్తీర్ణంలో 36.4% మేర వీరే పండిస్తున్నారు. దేశంలోని మరే రాష్ట్రంలోనూ ఇంత ఎక్కువ స్థాయిలో కౌలు సాగు లేదు.

2018 జులై నుంచి 2019 జూన్‌ మధ్య కేంద్ర గణాంకశాఖ నిర్వహించిన 77వ జాతీయ నమూనా సర్వే (National Sample Survey)లో ఈ విషయం వెల్లడైంది. ఇదే సమయంలో.. దేశవ్యాప్తంగానూ కౌలు కమతాలు, విస్తీర్ణం పెరుగుతున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

* తెలంగాణ (Telangana)లో కౌలు కమతాలు 17.5% కాగా.. కౌలుకు చేసే భూమి 11.9%.

ఇదీ చదవండి: CM JAGAN: దేవుడి దయ, ప్రజల దీవెనల వల్లే అఖండ విజయం:సీఎం

ABOUT THE AUTHOR

...view details