Former minister Vellampalli: సంతృప్తితో దేవాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించానని ఏపీ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. దుర్గ గుడికి ప్రభుత్వం నుంచి పెద్ద మొత్తంలో నిధులు కేటాయించేలా చర్యలు తీసుకున్నానని వెల్లడించారు. ఆర్య వైశ్యులకు సీఎం జగన్ ఎప్పుడూ అన్యాయం చేయలేదని.. కొన్ని రాజకీయ పార్టీలు వైకాపా ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తున్నాయన్నారు. మంత్రి పదవులు ఇచ్చినప్పుడే రెండున్నరేళ్లు ఉంటుందని ముఖ్యమంత్రి జగన్ చెప్పారని గుర్తు చేశారు. మంత్రి పదవులకు రాజీనామాలు చేశామన్న ఆందోళన ఎవరికి లేదన్నారు. ఎన్టీఆర్ జిల్లాకు మంత్రి పదవి రాకపోయినా అభివృద్ధి సంక్షేమం ఆగదన్నారు.
తాజా మాజీ మంత్రులు ఏమన్నారంటే - Former minister Vellampalli on Jagan
మంత్రుల ప్రమాణస్వీకారని ఆహ్వానం లేకపోవడం వల్లే హాజరుకాలేదని మాజీ మంత్రి అనిల్ కుమార్ అన్నారు. మంత్రి పదవులు ఇచ్చినప్పుడే రెండున్నరేళ్లు ఉంటుందని ముఖ్యమంత్రి జగన్ చెప్పారని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గుర్తు చేశారు.

AP former minister
Former minister Anil: కాకాణి గోవర్దన్‌రెడ్డి తనపట్ల చూపిన ప్రేమ, వాత్సల్యం, సహకారం ఇప్పుడు రెండింతలు అందిస్తానని.. మాజీ మంత్రి అనిల్ కుమార్ అన్నారు. ఆహ్వానం లేకపోవడం వల్లే మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి హాజరుకాలేదన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఘాటు విమర్శలు చేశారు. రాష్ట్రంలో అన్ని అసెంబ్లీ స్థానాలకు పోటీ చేయలేని పవన్ భీమ్లా నాయక్ కాదని ఎద్దేవా చేశారు.
తాజా మాజీల తొలి రోజు ఎలా ఉందంటే..
ఇదీ చదవండి :యాసంగి ధాన్యం మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే కొంటుంది: కేసీఆర్