AP Employees Union Leaders On Fitment: తమ అభిప్రాయాలు, ఆవేదనను ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి స్పష్టంగా చెప్పామని ఏపీ జేఏసీ ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. సీఎస్ కమిటీ సిఫార్సులను వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. 14.29 శాతం ఫిట్‌మెంట్‌ను అంగీకరించమన్నారు.
ఫిట్‌మెంట్, మానిటరీ బెనిఫిట్ అమలు, లబ్ధిలో తేడాలు ఉన్నాయి. ఏపీ సీఎంతో జరిగే చర్చల్లో స్పష్టత తీసుకుంటాం. ఐఆర్ కంటే ఎక్కువ ఫిట్‌మెంట్ ఇచ్చే సంప్రదాయం కొనసాగించాలి. సచివాలయ సంఘంలా 34 ఫిట్‌మెంట్‌కు మేం ఒప్పుకోం. 55 శాతం ఫిట్‌మెంట్ ఇస్తేనే అంగీకరిస్తాం
- బొప్పరాజు వెంకటేశ్వర్లు , ఏపీ జేఏసీ ఛైర్మన్
55 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలి - బండి శ్రీనివాస్
bandi srinivas on PRC: పీఆర్‌సీ, 70 డిమాండ్లపై సజ్జలతో చర్చించామని బండి శ్రీనివాస్ అన్నారు. సీఎం జగన్‌పై ఎంతో నమ్మకంతో ఉన్నామన్న ఆయన.. హామీలు అమలుచేసే వరకు ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు. 2018 జులై నుంచి 55 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎంత ఫిట్‌మెంట్ ఇస్తారనేది సీఎం ఇష్టమని వ్యాఖ్యానించారు.
sajjala On Fitment to Govt Employees: ఉద్యోగ సంఘాల నేతలు సీఎంతోనూ చర్చించే అవకాశం ఉందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. ఉద్యోగ సంఘాలతో చర్చల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఉద్యోగులకు ఇప్పటికే 27 శాతం ఐఆర్ ఇస్తున్నామని చెప్పారు. 14.29 శాతం ఫిట్‌మెంట్ వల్ల ఉద్యోగులకు నష్టం ఉండదన్నారు. 14.29 శాతం ఫిట్‌మెంట్ వల్ల ఐఆర్ కంటే రూపాయి కూడా తగ్గదన్న ఆయన.. 14.29 శాతం పీఆర్‌సీతో ఐఆర్ కంటే ఎక్కువగానే లబ్ధి చేకూరుతుందని అభిప్రాయపడ్డారు. ఉద్యోగులు కోరే 45 శాతం సాధ్యం కాదని కమిటీ చెప్పిందని సజ్జల చెప్పారు.