తెలంగాణ

telangana

ETV Bharat / city

Chalo Vijayawada Updates : నిర్భంధాలను ఛేదించుకుని విజయవాడకు ఉద్యోగులు

Chalo Vijayawada Updates : చలో విజయవాడకు రాకుండా అడుగడుగునా నిఘాపెట్టి నిర్బంధాలు చేసినా.. తమ కొత్త పీఆర్సీ పై తమ ఆగ్రహాన్ని ఆక్రోశాన్ని చాటారు ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయులు. ఒక్కసారిగా.. వేలాదిగా తరలివచ్చి ఆ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు.

Chalo Vijayawada Updates
Chalo Vijayawada Updates

By

Published : Feb 3, 2022, 2:19 PM IST

నిర్భంధాలను చేధించుకుని విజయవాడకు ఉద్యోగులు

Chalo Vijayawada Updates : చలో విజయవాడ ర్యాలీకి ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయులు తరలివచ్చారు. ఆ రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు విజయవాడ చేరుకున్నారు. పోలీసు నిర్బంధాలను ఛేదించుకుని విజయవాడలోని.. ఎన్జీవో భవన్‌ వద్దకు ఒక్కసారిగా వేలాదిమంది ఉద్యోగులు దూసుకొచ్చారు. పెద్దఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీగా ముందుకు సాగారు. బీఆర్‌టీఎస్ రోడ్డు వైపు నినాదాలతో ముందుకు సాగుతున్నారు. అణచివేస్తే ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతుందని ఉద్యోగులు హెచ్చరించారు.

Chalo Vijayawada News : పోలీసులు గుర్తు పట్టకుండా మారువేషాల్లో కొందరు ఉద్యోగులు, ఉపాధ్యాయులు తరలివచ్చారు. కొందరు రైతు వేషధారణలో.. మరికొందరు కూలీలుగా సంచులు పట్టుకుని విజయవాడ చేరుకున్నారు. పీఆర్సీ విషయంలో ఉద్యోగులను ప్రభుత్వం దగా చేసిందని ఉద్యోగ సంఘాలు ఆరోపించాయి. పాత జీతాలు వేస్తే చాలని.. కొత్త పీఆర్సీ వద్దంటూ ఉద్యోగులు నినాదాలు చేశారు. బీఆర్​టీఎస్ రోడ్డుకు చేరుకున్న ఉద్యోగులు, పెన్షనర్లను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. ప్రభుత్వ మొండి వైఖరి నశించాలని ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.

Chalo Vijayawada In AP : నగరంలోని హోటళ్లు, లాడ్జీలను.. .పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ఛలో విజయవాడ భాగంగా వివిధ జిల్లాల నుంచి తరలివచ్చిన సుమారు 200 మంది ఉద్యోగులను ఆరెస్టు చేసి అజీత్ సింగ్ నగర్ పోలీసు స్టేషన్‌కు తరలించారు.

AP Employees Protest Over PRC : విజయవాడ నగరంలోకి రాకుండా అన్ని మార్గాలను అష్టదిగ్బంధనం చేశారు. పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు, ఉయ్యూరు మండలంలో పోలీసులు ఉపాధ్యాయ సంఘాల నేతలను హౌస్ అరెస్టు చేశారు. కంకిపాడు మండలంలోని జాతీయ రహదారిపై దావులూరు టోల్‌గేట్‌ వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. నందిగామ బైపాస్‌ రోడ్‌లో బారికేడ్లును ఏర్పాటు చేసి.. వాహనాలను తనీఖీలు చేపడుతున్నారు. అనుమానం ఉన్న వ్యక్తి వద్ద సమాచారం సేకరిస్తున్నారు.

Chalo Vijayawada Latest Updates : చలో విజయవాడ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న.. విజయనగరం, శ్రీకాకుళం, గోదావరి జిల్లాల నుంచి వస్తున్న ఉపాధ్యాయులను పోలీసులు అడ్డుకున్నారు. కృష్ణా జిల్లా పొట్టిపాడు టోల్ గేట్ , గూడపల్లి చెక్ పోస్టు వద్ద సుమారు 50 మంది ఉపాధ్యాయులను అదుపులోకి తీసుకుని గన్నవరం బాలుర పాఠశాలలో ఉంచారు. న్యాయమైన డిమాండ్ల కోసం శాంతియుతంగా పోరాడుతున్న తమపై నిర్బంధకాండ ఏంటని ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

జగ్గయ్యపేట నుంచి విజయవాడ వరకు వెళ్లే జాతీయ రహదారిపై అడుగడుగునా పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు చేసి బస్సులు, కార్లను తనిఖీ చేసి పంపుతున్నారు. జగ్గయ్యపేట నుంచి వోల్వో బస్సులో వెళ్తున్న జిల్లా వీఆర్​ఓ ల సంఘం అధ్యక్షుడు రాటకొండ శ్రీనివాసరావు సహా నలుగురు ఉద్యోగులను కంచికచర్ల పోలీస్ స్టేష్టన్‌ తరలించారు.

ABOUT THE AUTHOR

...view details