తెలంగాణ

telangana

AP Employees on Fitment : 'ఫిట్‌మెంట్‌పై సీఎం దగ్గరే తేల్చుకుంటాం'

By

Published : Dec 16, 2021, 2:24 PM IST

AP Employees on Fitment : తమకు ఇచ్చే బెనిఫిట్స్ విషయంలో ప్రభుత్వం దొంగ లెక్కలు చెప్పే ప్రయత్నం చేస్తోందని ఏపీ ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు ఆరోపించారు. ఏపీ ప్రభుత్వం తమపై వేలకోట్లు ఖర్చు చేస్తోందని తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. విజయవాడ ధర్నా చౌక్​లో ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు ధర్నా చేపట్టారు.

AP PRC Issue, ఏపీ పీఆర్సీ వివాదం
ఏపీ పీఆర్సీ వివాదం

AP Employees on Fitment :ఏపీలోనివిజయవాడ ధర్నాచౌక్‌లో ఉద్యోగ సంఘాల జేఏసీ ధర్నా చేపట్టింది. అధికారుల కమిటీ ఇచ్చిన పీఆర్సీ నివేదికను ఆమోదించబోమని, ఇది ఉద్యోగులకు వ్యతిరేకంగా ఉందని ఉద్యోగ సంఘాలు స్పష్టం చేశాయి. ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఈ రోజు ధర్నాలు కొనసాగుతున్నాయని సంఘాల నాయకులు తెలిపారు.

AP PRC Issue : పీఆర్సీ నివేదిక పాక్షికంగా ఇచ్చారని.. మిగిలిన నివేదికలు కూడా ఇవ్వాలని ఏపీ ఐకాస అమరావతి ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు డిమాండ్​ చేశారు. 11 వ పీఆర్సీ కమిషన్ నివేదికను పట్టించుకోలేదని మండిపడ్డారు. అధికారుల కమిటీ వేసి.. నచ్చినట్టు నివేదిక ఇచ్చారని ఆరోపించారు. 14.39 శాతం ఫిట్‌మెంట్‌ కుదరదని చెప్పామని.. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని కోరారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకూ హెచ్ఆర్ఏ, డీఏ ఇవ్వాలని బొప్పరాజు విజ్ఞప్తి చేశారు.

'అధికారుల నివేదిక మాకు ఆమోదం కాదు. ఫిట్‌మెంట్‌పై సీఎం దగ్గరే తేల్చుకుంటాం. అధికారులు తప్పుడు సమాచారం ఇస్తున్నారు. ప్రభుత్వం దొంగలెక్కలు చెప్పే ప్రయత్నం చేస్తోంది.'

- ఏపీ ఐకాస అమరావతి ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు

AP Employees Protest Over PRC : 'మేము 50 శాతం ఫిట్‌మెంట్‌ అడుగుతున్నాం. కనీస వేతనం రూ.23 వేలు ఉండాలి. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల మూలవేతనం పెంచాలి. గ్రాట్యుటీ రూ.23 లక్షలకు పెంచాలి. ప్రభుత్వం స్పందిస్తేనే కార్యాచరణపై చర్చిస్తాం.'

- ఏపీ ఐకాస ఛైర్మన్‌ బండి శ్రీనివాసరావు

ABOUT THE AUTHOR

...view details