తెలంగాణ

telangana

ETV Bharat / city

AP PRC News: 'మమ్మల్ని అవమానిస్తున్నారు.. ప్రభుత్వ వైఖరి మారకపోతే ఉద్యమిస్తాం'

AP PRC News: ఏపీలో పీఆర్సీపై ఇంకా తర్జన భర్జన కొనసాగుతోంది. ఆర్థిక శాఖ అధికారులతో సమావేశమైన.. ఎలాంటి పురోగతి లేదని.. ఉద్యోగ సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగులను అవమానిస్తున్నా సహిస్తున్నామని.. పీఆర్సీతో పాటు సీపీఎస్‌ రద్దుపైనా స్పష్టత ఇవ్వాలని కోరినట్లు నేతలు చెప్పారు.

ap prc issue
ap prc issue

By

Published : Dec 30, 2021, 7:23 PM IST

AP PRC News: 'మమ్మల్ని అవమానిస్తున్నారు.. ప్రభుత్వ వైఖరి మారకపోతే ఉద్యమిస్తాం'

AP PRC News: ఏపీలో పీఆర్సీపై ఆర్థికశాఖ అధికారులతో జరిగిన భేటీలో ఎలాంటి పురోగతి కనిపించలేదని ఉద్యోగ సంఘాల నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏపీఎన్జీవో, ఏపీ రెవెన్యూ తదితర సంఘాలతో అధికారుల భేటీ నిర్వహించినా.. సమస్య కొలిక్కి రాలేదని చెప్పారు. ప్రభుత్వం పదే పదే సమావేశాలు నిర్వహిస్తూ అవమానిస్తుందే తప్ప.. న్యాయం మాత్రం చేయటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 2 వేల కోట్ల ఉద్యోగుల బిల్లులు చెల్లింపులపై ఏపీ ప్రభుత్వం నోరు విప్పకపోవటం అవమానకరమని అమరావతి జేఏసీ ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు.

'పీఆర్సీపై ఉద్యమించిన 2,500 మందికి మెమోలు ఇచ్చారు. కుంటిసాకులతో కొందరు నేతలను సస్పెండ్ చేశారు. సస్పెన్షన్‌ ఎత్తివేయకపోతే చర్చలకు రాబోమని చెప్పాం. ఈసారి సీఎం వద్ద మాత్రమే భేటీ ఏర్పాటు చేయాలని కోరాం. ఉద్యోగులకు 75 శాతం ఖర్చు చేస్తున్నామనడం అసత్యం. జీపీఎఫ్ సొమ్ము రూ.2,100 కోట్లు పక్కదారి పట్టించారు. ఫిట్‌మెంట్ 14.29 శాతమే ఇస్తామని ప్రతిపాదిస్తున్నారు. ఉద్యోగులను అవమానిస్తున్నా సహిస్తున్నాం. ఇప్పటి వరకు 7 డీఏలు చెల్లించలేదు. డీఏ బకాయిలు రూ.6 వేల కోట్లు ఇవ్వాలి. పీఆర్సీతో పాటు సీపీఎస్‌ రద్దుపై వెల్లడించాలి. ఒప్పంద సిబ్బంది క్రమబద్ధీకరణపై వెల్లడించాలి.'

- బొప్పరాజు వెంకటేశ్వర్లు, అమరావతి జేఏసీ ఛైర్మన్

ప్రభుత్వ చర్చలతో ఎలాంటి ఉపయోగం లేదు

ఏపీ ప్రభుత్వం విడతలవారీగా నిర్వహిస్తున్న జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంతో ఎలాంటి ఉపయోగం లేదని ఏపీ జేఏసీ నేత బండి శ్రీనివాసరావు అన్నారు. 2 వేల కోట్ల ఉద్యోగుల బిల్లులు చెల్లింపులపై ఏపీ ప్రభుత్వం మాట్లాడకుండా పెండింగ్​లో పెడుతోందని చెప్పారు. ప్రతిసారి ప్రభుత్వం నుంచి ఒకే సమాధానం రావటం విచారకరమన్నారు. 14.29 శాతం ఫిట్​మెంట్​పైనే ప్రభుత్వం మాట్లాడుతోందని.. దీన్ని పరిగణలోకి తీసుకోబోమని తేల్చిచెప్పామన్నారు. పీఆర్సీ నివేదికలోని 42 పేజీలతో ప్రభుత్వం ఇచ్చిన నివేదికనైనా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. తిరుపతిలో సీఎం జగన్, అమరావతిలో సీఎస్ ఇచ్చిన హామీలు ఇప్పటికీ నెరవేరని పరిస్థితి ఉందన్నారు. ప్రభుత్వ వైఖరి ఇలాగే ఉంటే తదుపరి కార్యాచరణకు చేపట్టక తప్పదని హెచ్చరించారు.

'ప్రభుత్వ చర్చలతో ఎలాంటి ఉపయోగం లేదు. 14.29 శాతం ఫిట్‌మెంట్‌ ఆమోదయోగ్యం కాదని చెప్పాం. సీఎం ఇచ్చిన హామీలు ఇప్పటికీ నెరవేరని పరిస్థితి. ప్రభుత్వ వైఖరి మారకపోతే ఉద్యమిస్తాం."

- బండి శ్రీనివాసరావు, ఏపీ జేఏసీ ఛైర్మన్

ఇదీచూడండి:KTR Tweet On Textiles GST: 'మా విన్నపం వినకపోయినా.. మీవాళ్ల మాటైనా వినిపించుకోండి'

ABOUT THE AUTHOR

...view details