తెలంగాణ

telangana

ETV Bharat / city

మధ్యాహ్నం 3 గంటల వరకు 53.57 శాతం పోలింగ్‌

ap elections 2021 live updates
ap elections 2021 live updates

By

Published : Mar 10, 2021, 6:44 AM IST

Updated : Mar 10, 2021, 4:21 PM IST

16:19 March 10

పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత

  • గుంటూరు విద్యానగర్ లిటిల్ ఫ్లవర్ పాఠశాల పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత
  • వైకాపా నేతలు దొంగఓట్లు వేయిస్తున్నారని తెదేపా అభ్యర్థి ఆరోపణ
  • తెదేపా అభ్యర్థిని బయటకు నెట్టివేసిన పోలీసులు
  • పోలింగ్ కేంద్రం వద్ద తెదేపా అభ్యర్థి కోటేశ్వరరావు ఆందోళన
  • లాఠీఛార్జీ చేసి తెదేపా శ్రేణులను చెదరగొట్టిన పోలీసులు

16:18 March 10

రాష్ట్రవ్యాప్తంగా మధ్యాహ్నం 3 గంటల వరకు 53.57 శాతం పోలింగ్‌

  • శ్రీకాకుళం జిల్లాలో మధ్యాహ్నం 3 వరకు 59.93 శాతం పోలింగ్‌
  • విజయనగరం జిల్లాలో మధ్యాహ్నం 3 వరకు 56.63 శాతం పోలింగ్‌
  • విశాఖ జిల్లాలో మధ్యాహ్నం 3 వరకు 47.86 శాతం పోలింగ్‌
  • తూ.గో జిల్లాలో మధ్యాహ్నం 3 వరకు 66.21 శాతం పోలింగ్‌
  • ప.గో జిల్లాలో మధ్యాహ్నం 3 వరకు 53.68 శాతం పోలింగ్‌
  • కృష్ణా జిల్లాలో మధ్యాహ్నం 3 వరకు 58.67 శాతం పోలింగ్‌
  • గుంటూరు జిల్లాలో మధ్యాహ్నం 3 వరకు 54.42 శాతం పోలింగ్‌
  • ప్రకాశం జిల్లాలో మధ్యాహ్నం 3 వరకు 64.31 శాతం పోలింగ్‌
  • నెల్లూరు జిల్లాలో మధ్యాహ్నం 3 వరకు 61.03 శాతం పోలింగ్‌
  • అనంతపురం జిల్లాలో మధ్యాహ్నం 3 వరకు 56.9 శాతం పోలింగ్‌

16:18 March 10

ఓటమి భయంతో వైకాపా దాడులకు తెగబడుతోంది: చంద్రబాబు

  • రాష్ట్రవ్యాప్తంగా తెదేపా సానుభూతిపరులపై దాడులు హేయం: చంద్రబాబు
  • ఎన్నికల సంఘం తక్షణమే చర్యలు తీసుకోవాలి: చంద్రబాబు
  • ఓటమి భయం వైకాపా నేతల్లో స్పష్టంగా కనిపిస్తోంది: చంద్రబాబు
  • దాడులు, దౌర్జన్యాలతో ఓటర్లను భయపెడుతున్నారు: చంద్రబాబు
  • విశాఖలో పోలింగ్‌ కేంద్రంలో రిగ్గింగ్‌ పరిశీలనకు వెళ్తే అరెస్టు చేస్తారా?: చంద్రబాబు
  • టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు ప్రణవ్, ఎమ్మెల్యే వెలగపూడిని అరెస్టు చేశారు: చంద్రబాబు
  • మచిలీపట్నం 13వ డివిజన్‌లో దినకర్‌పై కత్తులతో దాడి చేశారు: చంద్రబాబు
  • వైకాపా నేతల దాడులకు పోలీసులు అండగా నిలవడం హేయం: చంద్రబాబు
  • ఎన్నికల సంఘం తక్షణమే చర్యలు తీసుకోవాలి: చంద్రబాబు

16:17 March 10

కడప 31వ డివిజన్‌లో కొద్దిసేపు గందరగోళం

  • కాంగ్రెస్‌, వైకాపా నాయకుల మధ్య వాగ్వాదం
  • కాంగ్రెస్‌ కార్యకర్తలను బయటకు పంపాలన్న మంత్రి అంజాద్‌బాషా
  • కాంగ్రెస్‌, వైకాపా నాయకులను చెదరగొట్టిన పోలీసులు

14:20 March 10

మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్‌ శాతాలు

రాష్ట్రవ్యాప్తంగా 42.84

శ్రీకాకుళం 44.38

విజయనగరం 45.10

విశాఖ 36.75

తూ.గో. 53.08

ప.గో. 45.51

కృష్ణా 41.49

గుంటూరు 44.69

ప్రకాశం 53.19

నెల్లూరు 48.89

చిత్తూరు 41.28

అనంతపురం 45.42

కడప 46.02

కర్నూలు 40.99

14:18 March 10

మచిలీపట్నంలో తెదేపా కార్యకర్తపై కత్తులతో దాడి

కృష్ణా: మచిలీపట్నంలో తెదేపా కార్యకర్తపై కత్తులతో దాడి 

13వ డివిజన్‌లో ఓటేసేందుకు వచ్చిన దినకర్‌పై దాడి 

గాయపడిన దినకర్‌ను ప్రభుత్వ ఆస్పత్రికి తరలింపు

వైకాపా నేతలే దాడి చేశారని మాజీమంత్రి కొల్లు రవీంద్ర ఆరోపణ 

14:18 March 10

ఎమ్మెల్యే వెలగపూడి, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ అధ్యక్షుడు ప్రణవ్‌గోపాల్‌ అరెస్టు

విశాఖ: ఎమ్మెల్యే వెలగపూడి, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ అధ్యక్షుడు ప్రణవ్‌గోపాల్‌ అరెస్టు

ఏయూ హైస్కూల్‌ వద్ద ఎమ్మెల్యే, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ అధ్యక్షుడు అరెస్టు

రిగ్గింగ్‌ జరుగుతుందన్న సమాచారంతో పోలింగ్‌ కేంద్రానికి వెళ్లిన ఎమ్మెల్యే

విశాఖ: పోలీసులతో ఎమ్మెల్యే, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ అధ్యక్షుడు వాగ్వాదం

విశాఖ: అరెస్టు చేసి 3 వ పట్టణ పీఎస్‌కు తరలింపు

14:15 March 10

తెదేపా ఏజెంట్లపై పోలీసుల లాఠీఛార్జ్

అనంతపురం: 22వ డివిజన్‌లో తెదేపా ఏజెంట్లపై పోలీసుల లాఠీఛార్జ్

అనంతపురం: రాజేంద్ర మున్సిపల్ హైస్కూల్‌ పోలింగ్‌ కేంద్రం వద్ద లాఠీఛార్జ్‌

ఓటర్ల జాబితాలో ఫొటోలు సరిగా ముద్రించలేదని ప్రశ్నించిన తెదేపా ఏజెంట్లు

అనంతపురం: తెదేపా ఏజెంట్లపై దాడికి యత్నించిన వైకాపా ఏజెంట్లు

అనంతపురం: పోలింగ్ కేంద్రం వద్ద ఆందోళనకు దిగిన తెదేపా ఏజెంట్లు

తెదేపా ఏజెంట్లు, పోలీసుల మధ్య వాగ్వాదం, లాఠీఛార్జ్

తెదేపా కార్పొరేటర్ అభ్యర్తి అనురాధ సహా ఏజెంట్ల అరెస్టు

అనంతపురం: ఒకటో పట్టణ పీఎస్‌కు తరలించిన పోలీసులు

14:14 March 10

మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్‌ శాతాలు

శ్రీకాకుళం 44.38

విజయనగరం 45.10

విశాఖ 36.75

తూ.గో. 53.08

ప.గో. 45.51

కృష్ణా 41.49

గుంటూరు 44.69

ప్రకాశం 53.19

నెల్లూరు 48.89

చిత్తూరు 41.28

అనంతపురం 45.42

కడప 46.02

కర్నూలు 40.99

13:10 March 10

సత్తెనపల్లిలో రూట్ అధికారిని విధుల నుంచి తొలగిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు

గుంటూరు: సత్తెనపల్లిలో రూట్ అధికారిని విధుల నుంచి తొలగిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు

రూట్ విధుల్లో సరైన సమయంలో స్పందించలేదని విధుల నుంచి తొలగింపు

13:09 March 10

సత్తెనపల్లి 24వ వార్డు పోలింగ్ కేంద్రం వద్ద వివాదం

గుంటూరు: సత్తెనపల్లి 24వ వార్డు పోలింగ్ కేంద్రం వద్ద వివాదం

దొంగ ఓట్ల సమాచారంతో పోలింగ్‌ కేంద్రానికి వెళ్లిన తెదేపా అభ్యర్థులు

వైకాపా అభ్యర్థులు దొంగ ఓట్లు వేయిస్తున్నారని తెదేపా అభ్యర్థుల ఆరోపణ

తెదేపా, వైకాపా వర్గీయుల మధ్య చెలరేగిన వివాదం

తెదేపా నేత వై.వి.ఆంజనేయులు కారు అద్దాలు ధ్వంసం

పోలీసుల రంగప్రవేశంతో సద్దుమణిగిన వివాదం

13:04 March 10

ఓటేసిన మంత్రి బొత్స

విజయనగరంలో మహారాజా కళాశాలలో ఓటేసిన మంత్రి బొత్స

12:33 March 10

'దొంగ ఓట్లు వేయకుండా ఆపండి'

చిత్తూరు 29 వ డివిజన్‌ పోలింగ్‌ కేంద్రం వద్ద ఎస్‌.ఐ.కు స్వతంత్ర అభ్యర్థి ఫిర్యాదు

వైకాపా నాయకులు దొంగ ఓట్లు వేయిస్తున్నారని స్వతంత్ర అభ్యర్థి ఆరోపణ

దొంగ ఓట్లు వేయకుండా ఆపాలని ఎస్‌.ఐ. కాళ్లు పట్టుకున్న స్వతంత్ర అభ్యర్థి

12:31 March 10

ఓటర్లు సెల్‌ఫోన్‌తో వచ్చినా అనుమతించాలని ఎస్‌ఈసీ ఆదేశం

ఓటర్లు సెల్‌ఫోన్‌తో వచ్చినా అనుమతించాలని ఎస్‌ఈసీ ఆదేశం

సెల్‌ఫోన్‌ ఉన్నా అభ్యంతరం వ్యక్తం చేయవద్దని ఆదేశించిన ఎస్‌ఈసీ

12:09 March 10

కల్యాణదుర్గంలో ఎమ్మెల్యేను అడ్డుకున్న పోలీసులు

అనంతపురం: కల్యాణదుర్గంలో ఎమ్మెల్యేను అడ్డుకున్న పోలీసులు

పోలింగ్‌ కేంద్రాలకు వెళ్తుండగా ఉషశ్రీచరణ్‌ను అడ్డుకున్న పోలీసులు

అనంతపురం: నిబంధనలకు విరుద్ధమని తెలిపిన డీఎస్పీ రమ్య

12:06 March 10

సెల్‌ఫోన్‌తో వస్తే అనుమతించాలని పోలీసులకు గుంటూరు ఎస్పీ ఆదేశం

గుంటూరు: ఓటర్లు సెల్‌ఫోన్‌తో వస్తే అనుమతించాలని పోలీసులకు ఎస్పీ ఆదేశం

ఫోన్ స్విచ్‌ ఆఫ్‌ చేసి పెట్టుకోవాలని ఓటర్లకు సూచించిన ఎస్పీ అమ్మిరెడ్డి

ఉదయం నుంచి అనుమతించకపోవడంతో ఇబ్బంది పడిన ఓటర్లు

12:06 March 10

మార్కాపురం 35 వ వార్డులో పోలీసులతో తెదేపా నేతల వాగ్వాదం

ప్రకాశం: మార్కాపురం 35 వ వార్డులో పోలీసులతో తెదేపా నేతల వాగ్వాదం

ప్రకాశం: స్థానికేతర ఓట్లపై అభ్యంతరం తెలిపిన తెదేపా నేతలు

తెదేపా నాయకుడు కందుల రామిరెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

11:47 March 10

ఏపీలో ఉదయం 11 గంటల వరకు పోలింగ్‌ శాతాలు

శ్రీకాకుళం 24.58

విజయనగరం 31.97

విశాఖ 28.5

తూ.గో. 36.31

ప.గో. 34.14

కృష్ణా 32.64

గుంటూరు 33.62

ప్రకాశం 36.12

నెల్లూరు 32.67

చిత్తూరు 30.21

అనంతపురం 31.36

కడప 32.82

కర్నూలు 34.12

11:37 March 10

పోలింగ్‌ కేంద్రాలకు సెల్‌ఫోన్లతో ఓటర్లను అనుమతించని పోలీసులు

విజయవాడ: పోలింగ్‌ కేంద్రాలకు సెల్‌ఫోన్లతో ఓటర్లను అనుమతించని పోలీసులు

పోలింగ్‌ కేంద్రం ప్రాంగణం వద్దకు వెళ్లగానే చరవాణిలు వద్దంటూ అభ్యంతరం

తమకు ముందు సమాచారం ఇవ్వలేదంటున్న ఓటర్లు

ఫోన్లను భద్రపరిచే ఏర్పాట్లు లేవని ఓటర్ల ఆందోళన

ఓటరు స్లిప్పులతో వచ్చినా ఫోన్లతో అనుమతించక వెనుదిరిగిన ఓటర్లు

ఫోన్ల అనుమతిపై ఎన్నికల కమిషన్‌ స్పందించాలంటున్న ఓటర్లు


 

11:30 March 10

నంద్యాలలో తెదేపా, వైకాపా కార్యకర్తల మధ్య ఘర్షణ

కర్నూలు: నంద్యాల 34 వార్డులో తెదేపా, వైకాపా కార్యకర్తల మధ్య ఘర్షణ

ఓట్లేయకపోతే పథకాలు నిలిచిపోతాయని బెదిరిస్తున్నారని తెదేపా కార్యకర్తల ఆరోపణ

11:23 March 10

తిరుపతి 16వ వార్డులో ఉద్రిక్తత

తిరుపతి 16వ వార్డులో ఉద్రిక్తత

పోలింగ్‌ కేంద్రానికి వచ్చిన తెదేపా నాయకుడు జేబీ శ్రీనివాస్‌ అరెస్టు

పోలీసులతో వాగ్వాదానికి దిగిన 16వ వార్డు తెదేపా అభ్యర్థి

పోలీసుల వాహనం ఎదుట బైఠాయించిన తెదేపా కార్యకర్తలు

తెదేపా కార్యకర్తల నిరసనతో జేబీ శ్రీనివాస్‌ను వదిలేసిన పోలీసులు

11:22 March 10

ఐతానగర్‌లో రాజకీయ పార్టీలకు, పోలీసుల మధ్య వాగ్వాదం

గుంటూరు: తెనాలి ఐతానగర్‌లో రాజకీయ పార్టీలకు, పోలీసుల మధ్య వాగ్వాదం

రోడ్ల పక్కన టెంట్లు వేసి ఓటర్లను మభ్యపెడుతున్నారని తొలగించిన పోలీసులు

తమ ఇళ్ల వద్ద కూడా టెంట్లు వేసుకోకనీయకపోవడంపై తెదేపా నేతల అభ్యంతరం

అన్ని పార్టీల వారివి తొలగిస్తామని స్పష్టం చేసిన పోలీసులు

11:18 March 10

ఓటేసిన గవర్నర్ బిశ్వభూషణ్‌ దంపతులు

విజయవాడ సీవీఆర్ స్కూల్‌లో ఓటేసిన గవర్నర్ బిశ్వభూషణ్‌ దంపతులు

11:03 March 10

ఓటరు జాబితాలో ఆళ్ల నాని పేరు గల్లంతు

ఏలూరులోని 25వ డివిజన్‌లో ఓటేసేందుకు వచ్చిన మంత్రి ఆళ్ల నాని

జాబితాలో తన పేరు లేకపోవడంపై అధికారులను ప్రశ్నించిన ఆళ్ల నాని

10:43 March 10

కోళ్లమిట్ట పోలింగ్‌ కేంద్రం వద్ద ఘర్షణ

నెల్లూరు: సూళ్లూరుపేట కోళ్లమిట్ట పోలింగ్‌ కేంద్రం వద్ద ఘర్షణ

తెదేపా, వైకాపా వర్గీయుల మధ్య ఘర్షణ, చెదరగొట్టిన పోలీసులు

10:42 March 10

రాష్ట్రవ్యాప్తంగా 13.59 ఉదయం 9 గంటల వరకు పోలింగ్ శాతం

కార్పొరేషన్ల వారీగా

విజయనగరం కార్పొరేషన్‌ 10.24

విశాఖ కార్పొరేషన్‌ 8.89

మచిలీపట్నం కార్పొరేషన్‌ 12.33

విజయవాడ కార్పొరేషన్‌ 9.10

ఏలూరు కార్పొరేషన్‌ 13.2

గుంటూరు కార్పొరేషన్‌ 7.51

ఒంగోలు కార్పొరేషన్‌ 14.59

చిత్తూరు కార్పొరేషన్‌ 12.75

తిరుపతి కార్పొరేషన్‌ 5.74

అనంతపురం కార్పొరేషన్‌ 9.87

కడప కార్పొరేషన్‌ 3.98

కర్నూలు కార్పొరేషన్‌ 9.69

రాష్ట్రవ్యాప్తంగా 9.82

10:35 March 10

గ్రేటర్ విశాఖలో ఓటు హక్కును వినియోగించుకున్న మాజీ మంత్రి గంటా

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎం.వీ.పీ. కాలనీలో ఉన్న సెవెంత్ డే అడ్వెంటిస్ట్ స్కూల్ లో 17వ వార్డులో ఓటు వేశారు. ఎన్నికల ఏర్పాట్లు, ఓటింగ్ జరుగుతున్న సరళిపై గంటా సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. 

10:25 March 10

గుంటూరు 54వ డివిజన్‌లో స్వల్ప ఉద్రిక్తత

గుంటూరు 54వ డివిజన్‌లో స్వల్ప ఉద్రిక్తత

పోలింగ్‌ కేంద్రం వద్ద తెదేపా, కాంగ్రెస్‌ అభ్యర్థుల ఆందోళన

పోలింగ్ కేంద్రంలోకి వైకాపా అభ్యర్థులను అనుమతించారని ఆరోపణ

పిచ్చుకలకుంట వద్ద వైకాపా నాయకులు దూషించారని భాజపా అభ్యర్థి ఆందోళన

గుంటూరు: సంజీవ నగర్ పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత

గుర్తింపు లేకుండా ఓటర్లను వైకాపా నాయకులు తెస్తున్నారని ఆరోపణ

అడ్డుకున్న పోలీసులతో వాగ్వాదానికి దిగిన వైకాపా కార్యకర్తలు

10:05 March 10

సత్తెనపల్లి 7వార్డులో పోలింగ్ కేంద్రం వద్ద ఘర్షణ

గుంటూరు: సత్తెనపల్లి 7వార్డులో పోలింగ్ కేంద్రం వద్ద ఘర్షణ

స్వతంత్ర అభ్యర్థి ఉషారాణి భర్త నాగేశ్వరరావుపై జనసేన కార్యకర్తల దాడి

ఇరువర్గాల నాయకులను చెదరగొట్టిన పోలీసులు

09:55 March 10

ఓటింగ్‌ బహిష్కరించిన నూకలపాలెం గ్రామస్థులు

నెల్లూరు: సూళ్లూరుపేటలో ఓటింగ్‌ బహిష్కరించిన నూకలపాలెం గ్రామస్థులు

సూళ్లూరుపేట 13వ వార్డు పోలింగ్‌ కేంద్రం-1లో ఓటింగ్‌ బహిష్కరణ

తమ గ్రామాన్ని మున్సిపాలిటీలో విలీనం చేశారని నిరసిస్తూ బహిష్కరణ

నెల్లూరు: నూకలపాలెంలో మొత్తం 386 ఓట్లు

09:44 March 10

రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 9 వరకు పోలింగ్‌ శాతాలు

శ్రీకాకుళం 10

విజయనగరం 14

విశాఖ 14

తూ.గో. 16

ప.గో. 16

కృష్ణా 13

గుంటూరు 16

ప్రకాశం 14

నెల్లూరు 12

చిత్తూరు 9

అనంతపురం 12

కడప 8

కర్నూలు 11

09:37 March 10

తిరుపతి మహాత్మాగాంధీ పాఠశాల పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత

తిరుపతి 15వ వార్డు మహాత్మాగాంధీ పాఠశాల పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత

వైకాపా మద్దతుదారులను పోలింగ్ కేంద్రంలోకి అనుమతించిన పోలీసులు

తమను అనుమతించట్లేదంటూ తేదేపా నాయకుల నిరసన

వైకాపా, తెదేపా నేతల మధ్య వాగ్వాదం, చెదరగొట్టిన పోలీసులు

09:33 March 10

గుంటూరు స్టార్ బాలికల పాఠశాల పోలింగ్‌ కేంద్రం వద్ద వాగ్వాదం

గుంటూరు స్టార్ బాలికల పాఠశాల పోలింగ్‌ కేంద్రం వద్ద వాగ్వాదం

వైకాపా నాయకులు, పోలీసులకు మధ్య స్వల్ప తోపులాట

తమను పోలింగ్‌ కేంద్రానికి పంపకుండా అడ్డుకుంటున్నారని ఆరోపణ

తెదేపా ఏజంట్లను కూడా పంపాలని పోలీసులతో వైకాపా నాయకుల వాగ్వాదం

09:29 March 10

చిత్తూరు గంగనపల్లి పోలింగ్ కేంద్రంలో గందరగోళం

చిత్తూరు: 33వ డివిజన్‌ గంగనపల్లి పోలింగ్ కేంద్రంలో గందరగోళం

ఇతర డివిజన్ల ఓటర్లు వచ్చారని ఎస్పీకి మాజీ మేయర్‌ హేమలత ఫిర్యాదు

చిత్తూరు: పోలింగ్‌ కేంద్రానికి చేరుకున్న ఎస్పీ సెంథిల్‌కుమార్‌

09:25 March 10

పోలింగ్‌ కేంద్రాల ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఎస్‌ఈసీ

విజయవాడలో పోలింగ్‌ కేంద్రాల ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఎస్‌ఈసీ

ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ఏర్పాట్లు: ఎస్‌ఈసీ

ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేలా పరిస్థితులు కల్పించాం: ఎస్‌ఈసీ

రాజ్యాంగ బద్ధ హక్కును వినియోగించుకోవాలి: ఎస్‌ఈసీ రమేశ్‌ కుమార్‌

08:54 March 10

ఓటేసిన పవన్‌ కల్యాణ్‌

  • విజయవాడ పటమటలంక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఓటేసిన పవన్‌ కల్యాణ్‌
  • స్థానిక సంస్థల ఎన్నికల్లో తొలిసారి ఓటుహక్కు వినియోగించుకున్న పవన్‌

08:42 March 10

ప్రొద్దుటూరులో తెదేపా, వైకాపా వర్గీయుల మధ్య వాగ్వాదం

కడప: ప్రొద్దుటూరులో తెదేపా, వైకాపా వర్గీయుల మధ్య వాగ్వాదం

పోలింగ్‌ కేంద్రం వద్ద వైకాపా, తెదేపా వర్గీయుల మధ్య వాగ్వాదం, చెదరగొట్టిన పోలీసులు

08:39 March 10

విజయవాడలో పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షించిన ఎస్ఈసీ

  • విజయవాడలో పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షించిన ఎస్ఈసీ
  • సీవీఆర్ స్కూల్ ఆవరణలోని 4వ కేంద్రంలో ఓటింగ్‌ సరళి పరిశీలన
  • విజయవాడలోని బిషప్ గ్రేసి హైస్కూల్‌ను పరిశీలించిన ఎస్‌ఈసీ

08:33 March 10

ఓటుహక్కు వినియోగించుకున్న ఎంపీ విజయసాయిరెడ్డి

  • విశాఖ 14వ వార్టులో ఓటుహక్కు వినియోగించుకున్న ఎంపీ విజయసాయిరెడ్డి
  • మారుతీనగర్ పోలింగ్ కేంద్రం-11లో ఓటేసిన విజయసాయిరెడ్డి

08:28 March 10

ప్రొద్దుటూరులో తెదేపా, వైకాపా అభ్యర్థుల గృహనిర్బంధం

  • కడప: ప్రొద్దుటూరులో ఎన్నికల దృష్ట్యా పోలీసుల ముందస్తు చర్యలు
  • ప్రొద్దుటూరు 12వ వార్డులో తెదేపా, వైకాపా అభ్యర్థుల గృహనిర్బంధం

08:09 March 10

గుంటూరు నగర పాలక సంస్థలో ఓటర్ల జాబితాలో గందరగోళం

  • ఒకే కుటుంబానికి చెందిన ఓటర్లకు వేర్వేరు డివిజన్లలో ఓట్లు
  • భార్యకు ఒక చోట, భర్తకు మరోచోట ఓటు
  • వేరే డివిజన్‌లోకి ఎందుకు మార్చారంటూ ఓటర్ల ఆందోళన

08:03 March 10

విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మందకొడిగా పోలింగ్

విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 1,2 పోలింగ్ బూత్​లలో పోలింగ్ ప్రక్రియ మందకొడిగా మొదలైంది. మొదటి ఓటును 60 సంవత్సరాల వృద్ధుడు వినియోగించుకున్నారు.

07:53 March 10

విజయవాడ పటమట పోలింగ్ కేంద్రం వద్ద గందరగోళం

విజయవాడ పటమట పోలింగ్ కేంద్రం వద్ద గందరగోళం నెలకొంది. ప్రభుత్వం ఇచ్చిన ఓటరు స్లిప్పులపై ఉన్న నెంబర్లకు, పోలింగ్‌ అధికారి వద్దనున్న స్లిప్పులపై నెంబర్లలో తేడా వచ్చింది. తమకు ఓటు హక్కు ఉన్నా.. వినియోగించుకోలేక పోతున్నామని.. ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

07:47 March 10

భాజపా తరఫున ముక్కు పుడకలు పంపిణీ.

  • భాజపా తరఫున ముక్కు పుడకలు పంపిణీ
  • అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • కడప: ప్రొద్దుటూరు 11వ వార్డులో భాజపా తరఫున ముక్కు పుడకలు పంపిణీ
  • ముక్కు పుడకలు పంచుతున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

07:39 March 10

ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో ఆలస్యంగా పోలింగ్ ప్రారంభం

నెల్లూరు జిల్లా ఆత్మకూరు ‌మున్సిపాలిటీ పరిధిలో ఓటింగ్ ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు. దీంతో ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో 14,15, వార్డులు ఉండగా సమయం 7.10  అయినా ఒటింగ్ ప్రక్రియ ప్రారంభం కాలేదు. ఆత్మకూరు ‌మున్సిపాలిటీ పరిదిలో 23 వార్డులు ఉండగా 17 వార్డులు ఒటింగ్ జరుగుతుంది. 6 ఏకగ్రీవమయ్యాయి.

07:38 March 10

ప్రశాంతంగా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మున్సిపల్ పోలింగ్

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మున్సిపల్ పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. ఓటర్లు ఓటు వేసేందుకు ఉదయం పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.

07:37 March 10

విజయవాడలో నగర పాలక ఎన్నికల పోలింగ్

విజయవాడలో నగర పాలక ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం నుంచే ఓటు వేసేందుకు ప్రజలు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. 64 డివిజన్ల పరిధిలో 347 అభ్యర్థులు బరిలో ఉన్నారు. విజయవాడ కార్పొరేషన్ పరిధిలో మొత్తం 788 పోలింగ్ బూత్​లను ఏర్పాటు చేయగా.. ఎన్నికల విధుల్లో 7,500 మంది పోలింగ్ సిబ్బంది, ఒక్కో పోలింగ్ స్టేషన్​కు 5గురు బృందంగా విధులు నిర్వహిస్తున్నారు. కార్పొరేషన్ పరిధిలో 325 సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ కేంద్రాలను అధికారులు గుర్తించారు. వైకాపా 64 డివిజన్లు, తెదేపా 57 డివిజన్లలో, సీపీఐ - 6, జనసేన 33, బీఎస్పీ 2, భాజపా 27, సీపీఎం 22, కాంగ్రెస్ 34, ఇతరులు 7, ఇండిపెండెంట్లు 94 చోట్ల పోటీ చేస్తున్నారు. నగరంలో మొత్తం ఓటర్లు 7, 81, 883 మంది కాగా మహిళా ఓటర్లు 3, 95,737 మంది, పురుష ఓటర్లు 38,623 మంది ఉన్నారని అధికారులు తెలిపారు.

07:26 March 10

అమలాపురంలో ప్రశాంతంగా మున్సిపల్ పోలింగ్..

ఏపీ తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో మున్సిపల్ పోలింగ్ ప్రశాంతంగా మొదలైంది. ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుని సద్వినియోగం చేసుకుంటున్నారు. మున్సిపాలిటీలో 30 వార్డులకుగాను ఆరు వార్డులు ఏకగ్రీవమయ్యాయి . ఇక 24వ వార్డులో పోలింగ్ జరుగుతుంది. 24 వార్డులకు సంబంధించి మొత్తం 32,040 మంది ఓటర్లు ఉన్నారు. పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు క్రమేపీ చేరుకుంటున్నారు.

07:08 March 10

పురపాలిక ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం

  • ఏపీ పురపాలిక ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం
  • సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనున్న పోలింగ్
  • 12 నగరపాలక, 71 పురపాలక, నగర పంచాయతీల్లో పోలింగ్‌

06:36 March 10

ఏపీ : 12 కార్పొరేషన్లు, 71 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఎన్నికలు

  • ఏపీలో నేడు పురపాలిక ఎన్నికలు
  • 12 కార్పొరేషన్లు, 71 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఎన్నికలు
  • మొత్తం 2,214 వార్డులకు ఎన్నికలు
  • ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్
  • 12 కార్పొరేషన్లలో 671 డివిజన్లకు 90 డివిజన్లు ఏకగ్రీవం
  • 12 కార్పొరేషన్లలో మిగిలిన 581 డివిజన్లకు పోలింగ్‌
  • 75 మున్సిపాల్టీలు, నగర పంచాయతీల్లో 2,123 వార్డులకు నోటిఫికేషన్‌
  • 2,123 వార్డులకు 490 వార్డులు ఏకగ్రీవం
  • పులివెందుల, పుంగనూరు మున్సిపాలిటీల్లో అన్ని వార్డులు ఏకగ్రీవం
  • మాచర్ల, పిడుగురాళ్ల మున్సిపాలిటీల్లో అన్ని వార్డులు ఏకగ్రీవం
  • 71 మున్సిపాలిటీలు, నగరపంచాయతీల్లో మిగిలిన 1,633 వార్డులకు పోలింగ్
  • 12 కార్పొరేషన్లలో పోటీలో 2,569 మంది అభ్యర్థులు
  • మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో పోటీలో 4,981 మంది అభ్యర్థులు
  • మొత్తం పోటీలో ఉన్న 7,549 మంది అభ్యర్థులు
  • ఓటు హక్కు వినియోగించుకోనున్న 77,73,231 మంది ఓటర్లు
  • పురుషులు 38,25,129 మంది, మహిళా ఓటర్లు 39,46,952 మంది
  • ఇతరులు 1,150 మంది ఓటర్లు
  • పోలింగ్ కోసం మొత్తం 7,915 కేంద్రాలు ఏర్పాటు
  • కార్పొరేషన్లలో 4,626 పోలింగ్‌ కేంద్రాలు
  • మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో 3,289 పోలింగ్ కేంద్రాలు
  • కార్పొరేషన్లలో 1,235 సమస్యాత్మక,1,151 అతి సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తింపు
  • మున్సిపాలిటీల్లో 1,233 సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తింపు
  • మున్సిపాలిటీల్లో 1,169 అతి సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తింపు
  • పోలింగ్ విధులకు 48,723 మంది సిబ్బంది
  • ఏదైనా కారణాలతో పోలింగ్ నిర్వహించలేకపోతే 13 న రీపోలింగ్
  • ఈ నెల 14 న ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు
  • ఓట్ల లెక్కింపు అనంతరం వెంటనే ఫలితాలు వెల్లడి
  • కృష్ణా, గుంటూరు, విశాఖపట్నం జిల్లాల్లో ఎన్నికలపై ఎస్‌ఈసీ ప్రత్యేక దృష్టి
  • కృష్ణా జిల్లాలో పోలింగ్ సరళిని పరిశీలించనున్న ఎస్‌ఈసీ నిమ్మగడ్డ
  • గుంటూరులో పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షించనున్న ఎస్‌ఈసీ కార్యదర్శి కన్నబాబు
  • ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి: ఎస్ఈసీ
  • హింసాత్మక ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు: ఎస్‌ఈసీ
  • ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించడానికి అందరూ సహకరించాలి: ఎస్ఈసీ
  • ఓటర్లందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి: ఎస్ఈసీ
  • అన్ని ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తు, నిఘా ఏర్పాటు చేశాం: ఎస్ఈసీ
  • ఓటర్లు నిర్భయంగా ఓటు వేయవచ్చు: ఎస్‌ఈసీ నిమ్మగడ్డ
Last Updated : Mar 10, 2021, 4:21 PM IST

ABOUT THE AUTHOR

...view details