స్థానిక సంస్థల ఎన్నికలపై పలు పార్టీలతో బుధవారం ఉదయం 10 గంటలకు ఏపీ ఎన్నికల సంఘం సమావేశం కానుంది. ఎస్ఈసీ కార్యాలయంలో జరిగే ఈ భేటీలో ఎన్నికల నిర్వహణపై పార్టీల అభిప్రాయం తీసుకోనుంది. పార్టీ ప్రతినిధులతో విడివిడిగా భేటీ కానున్న ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్.. అభిప్రాయాలు రాతపూర్వకంగా కూడా ఇవ్వాలని కోరారు.
వివిధ రాజకీయ పార్టీలతో రేపు ఏపీ ఎన్నికల సంఘం సమావేశం - ఏపీ ఎన్నికల సంఘం తాజా వార్తలు
ఏపీలోని రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ బుధవారం ఉదయం 10 గంటలకు సమావేశం కానున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై నేతలతో చర్చించి.. అభిప్రాయాలు తీసుకోనున్నారు.
వివిధ రాజకీయ పార్టీలతో రేపు ఏపీ ఎన్నికల సంఘం సమావేశం
భేటీలో వైకాపా తరపున అంబటి రాంబాబు, తెదేపా తరఫున అచ్చెన్నాయుడు, భాజపా నుంచి పాక సత్యనారాయణ, కాంగ్రెస్ నుంచి మస్తాన్ వలీ, సీపీఎం నుంచి వెంకటేశ్వర్లు, సీపీఐ నుంచి రామకృష్ణ హాజరు కానున్నారు.
ఇదీచదవండి:వేడెక్కిన దుబ్బాక ఉపఎన్నిక రాజకీయం... కొనసాగుతోన్న ఉద్రిక్తత