తెలంగాణ

telangana

ETV Bharat / city

AP EAPCET: అగ్రికల్చర్‌, ఫార్మసీ ఫలితాలు విడుదల - ap eapcet agriculture and pharmacy results released

ఫార్మసీ, వ్యవసాయ విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్ ఫలితాలను ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ విడుదల చేశారు. దాదాపు 93శాతం మంది ఉత్తీర్ణత సాధించారని మంత్రి తెలిపారు.

AP EAPCET: అగ్రికల్చర్‌, ఫార్మసీ ఫలితాలు విడుదల
AP EAPCET: అగ్రికల్చర్‌, ఫార్మసీ ఫలితాలు విడుదల

By

Published : Sep 14, 2021, 12:00 PM IST

ఏపీ ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఏపీ ఈఏపీసెట్-2021) ఫలితాలు విడుదలయ్యాయి. ఇప్పటికే ఇంజినీరింగ్‌ ఫలితాలను వెల్లడించగా.. తాజాగా అగ్రికల్చర్‌, ఫార్మసీ ఫలితాలను వెల్లడించారు. మంగళగిరిలోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్​ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ ఈ ఫలితాలను విడుదల చేశారు.

అగ్రికల్చర్‌, ఫార్మసీ విభాగాల్లో ప్రవేశానికి 83,822 మంది విద్యార్థులు దరఖాస్తు చేయగా 78,066 మంది పరీక్షలకు హాజరయ్యారని తెలిపారు. ఫలితాల్లో 72,488 (92.85 శాతం) మంది ఉత్తీర్ణత సాధించినట్లు మంత్రి వివరించారు.

తూర్పుగోదావరి జిల్లా కోరుకొండకు చెందిన చందం విష్ణు వివేక్‌కు మొదటి ర్యాంకు వచ్చినట్లు మంత్రి సురేశ్‌ తెలిపారు. అనంతపురానికి చెందిన శ్రీనివాస కార్తికేయకు రెండో ర్యాంకు, హనుమకొండకు చెందిన బొల్లినేని విశ్వాస్‌రావుకు మూడో ర్యాంకు, హైదరాబాద్‌కు చెందిన గజ్జల సమీహనరెడ్డి, కాసా లహరికి నాలుగు, ఐదు ర్యాంకులు వచ్చినట్లు మంత్రి వివరించారు.

  • మొదటి ర్యాంకు-చందం విష్ణు వివేక్‌(కోరుకొండ-తూ.గో.)
  • రెండో ర్యాంకు-శ్రీనివాస కార్తికేయ(అనంతపురం)
  • మూడో ర్యాంకు-బొల్లినేని విశ్వాస్‌రావు(హనుమకొండ)
  • నాలుగో ర్యాంకు-గజ్జల సమీహనరెడ్డి(రంగారెడ్డి)
  • ఐదో ర్యాంకు-కాసా లహరి(హైదరాబాద్‌)
  • ఆరో ర్యాంకు-కాశీందుల చైతన్యకృష్ణ(గుంటూరు)
  • ఏడో ర్యాంకు-నూతలపాటి దివ్య(గుంటూరు)
  • ఎనిమిదో ర్యాంకు-కల్యాణం రాహుల్‌ సిద్దార్థ్‌(సిద్దిపేట)
  • తొమ్మిదో ర్యాంకు-తాడిసిన సాయిరెడ్డి(గరిడేపల్లి-నల్గొండ)
  • పదో ర్యాంకు-గద్దె విడిప్‌(గుంటూరు)

ఇదీ చదవండి:Ts schools: 8 వేల మంది టీచర్లకు డిప్యుటేషన్లు

ABOUT THE AUTHOR

...view details