ఏపీలో కొత్తగా 10,621 కరోనా కేసులు.. 92 మరణాలు - BREAKING
17:18 August 27
ఏపీలో కొత్తగా 10,621 కరోనా కేసులు.. 92 మరణాలు
ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. వరుసగా రెండో రోజూ 10వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో 61,300 నమూనాలను పరీక్షించగా వారిలో 10,621 మందికి ఈ వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బులెటిన్ విడుదల చేసింది. ఒక్కరోజులో 92 మంది కరోనాతో చికిత్స పొందుతూ మృతిచెందారు. కర్నూలు జిల్లాలో 13 మంది, నెల్లూరు 11, తూర్పుగోదావరి 10, చిత్తూరు 9, కడప 7, పశ్చిమగోదావరి 7, అనంతపురం 6, ప్రకాశం 6, విశాఖపట్నం 6, గుంటూరు 5, కృష్ణా 4, శ్రీకాకుళం 4, విజయనగరం జిల్లాలో నలుగురు చొప్పున మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 3,633కి చేరింది. గత 24 గంటల్లో 8,528 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు 34,79,990 నమూనాలను పరీక్షించారు.
ఇవీచూడండి:బాలీవుడ్‌కు 'డ్రగ్స్' మరక.. గుట్టు బయటపెడతానన్న కంగన