ఏపీలో మరోసారి భారీగా కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 10,830 మంది కరోనా బారినపడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,82,469కి చేరింది. కరోనాతో మరో 81 మంది మృతి చెందగా.. మొత్తం సంఖ్య 3,541కి చేరింది. వైరస్ నుంచి 2,86,720 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం ఏపీలో 92,208 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ఆంధ్రాలో 24 గంటల వ్యవధిలో 61,838 మందికి కరోనా పరీక్షలు చేశారు. ఇప్పటివరకు 34.18 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్టు ఏపీ ప్రభుత్వం వెల్లడించింది.
జిల్లాల వారీగా మరణాలు...
తూర్పుగోదావరి జిల్లాలో 11, ప్రకాశం జిల్లాలో 9, చిత్తూరు, కడప జిల్లాల్లో 8 మంది చొప్పున కరోనాతో మృతి చెందారు. అనంతపురం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఆరుగురు చొప్పున, కృష్ణా, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో ఐదుగురు చొప్పున మరణించారు. గుంటూరు, శ్రీకాకుళం జిల్లాల్లో నలుగురు చొప్పున కరోనాతో మృతి చెందారు.
జిల్లాల వారీగా కేసులు...
తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 1,528 కరోనా కేసులు నమోదయ్యాయి. నెల్లూరు జిల్లాలో 1,168.. విశాఖ జిల్లాలో 1,156, పశ్చిమగోదావరి జిల్లాలో 1065, చిత్తూరు జిల్లాలో 913, ప్రకాశం జిల్లాలో 786, కర్నూలు జిల్లాలో 745, కడప, అనంతపురం జిల్లాల్లో 728, శ్రీకాకుళం జిల్లాలో 618, విజయనగరం జిల్లాలో 564, గుంటూరు జిల్లాలో 532, కృష్ణా జిల్లాలో 24 గంటల వ్యవధిలో 299 కరోనా కేసులు నమోదయ్యాయి.
ఇవీ చూడండి:మొహర్రం ఊరేగింపునకు సుప్రీంకోర్టు అనుమతి నిరాకరణ: హైకోర్టు