ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 84,858 పరీక్షలు నిర్వహించగా.. 2,252 కేసులు నిర్ధరణ అయ్యాయి. ఫలితంగా ఇప్పటివరకు 19,54,765 మంది వైరస్ బారినపడినట్లు ఏపీ వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్ వల్ల 15 మంది బాధితులు ప్రాణాలు కోల్పోగా మొత్తం మృతుల సంఖ్య 13,256కి చేరింది.
corona cases: ఏపీలో కొత్తగా 2,252 కరోనా కేసులు, 15 మరణాలు - ఏపీ కరోనా తాజా వార్తలు
ఏపీలో తాజాగా 2,252 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. కొవిడ్ వల్ల 15 మంది బాధితులు మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం ఏపీలో 22,155 యాక్టివ్ కేసులున్నట్లు అధికారులు వెల్లడించారు.
ap-corona-cases
24 గంటల వ్యవధిలో 2,440 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 19,19,354కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం ఏపీలో 22,155 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో ముగ్గురు, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో ఇద్దరు మృత్యువాతపడ్డారు.