తెలంగాణ

telangana

ETV Bharat / city

AP Corona: ఏపీలో కొత్తగా 6,952 కరోనా కేసులు.. 58 మరణాలు - corona ap cases

ఏపీలో కరోనా క్రమంగా తగ్గుముఖం పడుతోంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 6,952 మందికి వైరస్ సోకింది. మహమ్మారి ధాటికి మరో 58 మంది మృతి చెందగా అత్యధికంగా ప్రకాశం జిల్లాలో మరణాలు నమోదయ్యాయి.

AP Corona cases
ఏపీలో కొత్తగా 6952 కరోనా కేసులు

By

Published : Jun 12, 2021, 6:51 PM IST

ఏపీలో కరోనా తగ్గుముఖం పడుతోంది. గడచిన 24 గంటల వ్యవధిలో 1,08,616 మందికి పరీక్షలు చేయగా.. 6,952 మందికి వైరస్‌ సోకింది. మహమ్మారికి మరో 58 మంది బలయ్యారు. ప్రకాశం జిల్లాలో అత్యధికంగా 11మంది మృతి చెందారు.

చిత్తూరు జిల్లాలో 9, తూర్పు గోదావరి జిల్లాలో ఆరుగురు మృతి చెందారు. అనంతపురం, కృష్ణా, విశాఖ జిల్లాల్లో ఐదుగురు చొప్పున మృత్యువాతపడ్డారు. చిత్తూరు 1,199, తూర్పు గోదావరి 1,167 కరోనా కేసులు నమోదు కాగా.. పశ్చిమ గోదావరి 663, ప్రకాశం 552 మంది వైరస్ బారిన పడ్డారు.

ఏపీలో కొత్తగా 6952 కరోనా కేసులు

ఇదీ చదవండి:etala resign: ఎమ్మెల్యే పదవికి ఈటల రాజేందర్ రాజీనామా

ABOUT THE AUTHOR

...view details