ఏపీలో కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా 21,452 కరోనా కేసులు, 89 మరణాలు నమోదయ్యాయి. కరోనా నుంచి మరో 19,095 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం 1,97,370 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. 24 గంటల వ్యవధిలో 90,750 కరోనా పరీక్షలు నిర్వహించినట్టు ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
కరోనా ఉద్ధృతి: ఏపీలో మళ్లీ 20 వేలు దాటిన కేసులు - Andhra News
ఏపీలో కరోనా కేసులు మళ్లీ 20 వేలు దాటాయి. 24 గంటల్లో మొత్తం 90,750 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 21,452 మందికి పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది. మహమ్మారి బారిన పడి 89 మంది మరణించారు.
కరోనాతో అత్యధికంగా విశాఖ జిల్లాలో 11 మంది మృతిచెందారు. తూర్పుగోదావరి, కృష్ణా, విజయనగరం జిల్లాల్లో 9 మంది చొప్పున వైరస్‌కు బలయ్యారు. చిత్తూరు, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో 8 మంది చొప్పున మృతిచెందారు. శ్రీకాకుళం జిల్లాలో 7, అనంతపురం జిల్లాలో ఆరుగురు, కర్నూలు జిల్లాలో 5, ప్రకాశం జిల్లాలో నలుగురు, పశ్చిమగోదావరి జిల్లాలో ముగ్గురు, కడప జిల్లాలో ఇద్దరు మృతిచెందారు.
జిల్లాల వారీగా..
తూర్పుగోదావరి జిల్లాలో 2,927, విశాఖ జిల్లాలో 2,238, అనంతపురం జిల్లాలో 2,185, చిత్తూరు జిల్లాలో 1,908, గుంటూరు జిల్లాలో 1,836, కడప జిల్లాలో 1,746, నెల్లూరు జిల్లాలో 1,689, కర్నూలు జిల్లాలో 1,524, శ్రీకాకుళం జిల్లాలో 1,285, పశ్చిమగోదావరి జిల్లాలో 1,232, ప్రకాశంలో 1,192, కృష్ణాలో 997, విజయనగరంలో 693 కరోనా కేసులు నమోదయ్యాయి.