ఏపీలో కొత్తగా 10,776 కరోనా కేసులు.. 76 మరణాలు - ap corona bulletin
18:58 September 04
ఏపీలో కొత్తగా 10,776 కరోనా కేసులు.. 76 మరణాలు
ఏపీలో కరోనా కేసుల తీవ్రత కొనసాగుతోంది. వరుసగా తొమ్మిదో రోజూ 10వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజు వ్యవధిలో 59,919 నమూనాలను పరీక్షించగా 10,776 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో ఏపీలో పాజిటివ్ కేసుల సంఖ్య 4,76,506కి చేరింది. ఈ మేరకు ఏపీ వైద్యఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో 76 మంది కరోనాతో మృతిచెందారు.
చిత్తూరు జిల్లాలో 9 మంది, ప్రకాశం 9, గుంటూరు 8, కడప 8, నెల్లూరు 8, తూర్పుగోదావరి 6, విశాఖపట్నం 6, పశ్చిమగోదావరి 6, కృష్ణా 5, శ్రీకాకుళం 4, అనంతపురం 3, కర్నూలు 2, విజయనగరంలో ఇద్దరు మరణించినట్లు బులెటిన్‌లో పేర్కొన్నారు. ఒక్కరోజులో 12,334 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 39,65,694 నమూనాలను పరీక్షించారు. తాజా లెక్కలతో కలిపి 1,02,067 కరోనా యాక్టివ్ కేసులున్నట్లు అధికారవర్గాలు వెల్లడించాయి.