ఏపీలో కొత్తగా 23,920 కరోనా కేసులు, 83 మరణాలు నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో లక్షా 14,299 పరీక్షలు నిర్వహించారు. కరోనా నుంచి మరో 11, 411 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం 1,43,178 యాక్టివ్ కేసులు కొనసాగుతున్నాయి.
తూర్పు గోదావరి జిల్లాలో 12 మంది..
కరోనాతో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 12 మంది మృతి చెందగా.. విశాఖ, అనంతపురం, కృష్ణాలో 8 మంది మృత్యువాత పడ్డారు. మహమ్మారితో విజయనగరం, ప్రకాశం జిల్లాల్లో ఏడుగురు చొప్పున మృతి చెందారు. చిత్తూరు, నెల్లూరు, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఆరుగురు చొప్పున మరణించారు. వైరస్ బారిన పడి గుంటూరు జిల్లాలో 5, కర్నూలు జిల్లాలో నలుగురు కన్నుమూశారు.