తెలంగాణ

telangana

ETV Bharat / city

Water issue: కేఆర్​ఎంబీకి ఏపీ లేఖ.. విద్యుత్ ఉత్పాదనపై అభ్యంతరం

శ్రీశైలం ప్రాజెక్టులో తెలంగాణ విద్యుత్ ఉత్పాదనపై కేఆర్ఎంబీకి ఏపీ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. అవసరం లేకున్నా విద్యుదుత్పత్తి చేయడంతో ప్రాజెక్టులో నీటిమట్టం తగ్గుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. ఫలితంగా విలువైన జలాలు వృథాగా సముద్రంలో కలుస్తున్నాయని వివరించింది.

Water issue
Water issue

By

Published : Aug 19, 2021, 7:07 AM IST

కృష్ణా జలాల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మళ్లీ వివాదం మొదలైంది. శ్రీశైలం ప్రాజెక్టులో తెలంగాణ విద్యుత్ ఉత్పాదనపై కేఆర్‌ఎంబీకి ఏపీ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. కేఆర్‌ఎంబీ సభ్య కార్యదర్శికి ఏపీ జలవనరులశాఖ ఇంజినీరింగ్ చీఫ్‌ లేఖ రాశారు. అవసరం లేకున్నా విద్యుత్ ఉత్పత్తి చేయటం వల్ల శ్రీశైలం ప్రాజెక్టులో నీటిమట్టం తగ్గుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.

నీటిమట్టం 854 అడుగులకు చేరితే రాయలసీమకు నీరివ్వలేమని ఈఎన్‌సీ పేర్కొన్నారు. తెలుగుగంగ ప్రాజెక్టు ద్వారా చెన్నై నగరానికి కూడా తాగునీరు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందని వెల్లడించారు. విద్యుత్ ఉత్పాదన ద్వారా విడుదలవుతున్న నీటిని నాగార్జునసాగర్​లో నిలిపే అవకాశం లేదని వివరించారు. ఫలితంగా విలువైన జలాలు వృథాగా సముద్రంలో కలిసిపోతున్నాయని లేఖలో పేర్కొన్నారు. విద్యుత్ ఉత్పాదనను తక్షణమే నిలిపి వేసేలా ఆదేశాలు ఇవ్వాలని కేఆర్ఎంబీని కోరారు.

ఇదీచదవండి.

ఆండ్రూస్ కంపెనీ గనుల తవ్వకాలపై లోతుగా విచారణ: గోపాల కృష్ణ ద్వివేదీ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details