తెలంగాణ

telangana

ETV Bharat / city

Jagan Delhi Tour: ముగిసిన సీఎం జగన్‌ దిల్లీ పర్యటన..

Jagan Delhi Tour: ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి... రెండు రోజుల దిల్లీ పర్యటన ముగిసింది. కేంద్ర విద్యా సంస్థలకు బడ్జెట్‌లో నిధులు, నూతన విద్యా విధానం అమలు, విభజన కష్టాలు, ఆర్థికలోటు వివిధ అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు.

Jagan
Jagan

By

Published : Jan 4, 2022, 5:10 PM IST

Jagan Delhi Tour: ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డి.. రెండు రోజుల పర్యటన ముగిసింది. పర్యటనలో భాగంగా కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ, అనురాగ్‌ ఠాకూర్‌, ధర్మాంద్ర ప్రదాన్‌ను కలిసి.. వివిధ అంశాలపై చర్చించారు. దిల్లీ పర్యటనలో తొలిరోజు ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసిన జగన్‌.. ఆర్థిక లోటు, విభజన కష్టాలను పరిష్కరించాలని కోరారు.

గడ్కరీతో భేటీ.. పలు సమస్యలపై చర్చ...

ఇవాళ కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీని సీఎం కలిశారు. ఆంధ్రప్రదేశ్‌లో రహదారుల నిర్మాణం, జాతీయ రహదారుల విస్తరణపై చర్చించారు. తీరప్రాంతం వెంట నాలుగు లైన్ల రహదారుల నిర్మాణం చేపట్టాలని కోరారు. విశాఖ-భోగాపురం జాతీయ రహదారి నిర్మాణం వేగవంతం చేయాలని.. విజ్ఞప్తి చేశారు. విజయవాడ తూర్పు హైవే ఏర్పాటుపైనా చర్చించారు. పెండింగ్ ప్రాజెక్టులకు త్వరగా అనుమతులు ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్ కోరారు.

నితిన్ గడ్కరీతో సమావేశం తర్వాత...కేంద్ర సమాచార ప్రసారాలు, క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్‌ను సీఎం జగన్ కలిశారు. అనంతరం కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్​తో భేటీ అయ్యారు. ఏపీలో నవోదయ పాఠశాలల ఏర్పాటుపై కేంద్రమంత్రితో చర్చించారు. కేంద్ర విద్యా సంస్థలకు బడ్జెట్‌లో నిధులు, నూతన విద్యా విధానం అమలుపై చర్చించారు.

ఇదీచూడండి:

Telangana High Court on Corona: కొవిడ్ పరిస్థితిపై హైకోర్టుకు నివేదిక సమర్పించిన డీహెచ్, డీజీపీ

ABOUT THE AUTHOR

...view details