తెలంగాణ

telangana

ETV Bharat / city

నేడు 'జగనన్న విద్యా కానుక'కు శ్రీకారం.. మరికొద్దిసేపట్లో ప్రారంభం - జగనన్న విద్యా కానుక పథకం ప్రారంభిచనున్న సీఎం

ఏపీలోని కృష్ణా జిల్లా పునాదిపాడులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జగనన్న విద్యా కానుక పథకాన్ని ముఖ్యమంత్రి జగన్ నేడు ప్రారంభించనున్నారు. ఈ పథకం ద్వారా ఏపీలోని 42 లక్షల 34 వేల 322 మంది విద్యార్థులకు దాదాపు 650 కోట్ల రూపాయల ఖర్చుతో ప్రభుత్వం... స్టూడెంట్ కిట్లు పంపిణీ చేయనుంది.

ap cm jagan will launch jagananna vidya kanuka in punadipadu
నేడు 'జగనన్న విద్యా కానుక' ప్రారంభించనున్న ఏపీ సీఎం

By

Published : Oct 8, 2020, 9:05 AM IST

ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న జగనన్న విద్యా కానుక పథకాన్ని కృష్ణా జిల్లాలోని పునాదిపాడులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో... నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ పథకం ద్వారా ఏపీలోని 42 లక్షల 34 వేల 322 మంది విద్యార్థులకు దాదాపు రూ. 650 కోట్లతో... స్టూడెంట్ కిట్లు పంపిణీ చేయనున్నారు. అన్నిప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, కేజీవీబీ, వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు... స్డూడెంట్‌ కిట్లు అందించనున్నారు.

ఇప్పటికే కిట్లను ఆయా పాఠశాలలకు పంపనట్టు... పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు వాడ్రేవు చినవీరభద్రుడు తెలిపారు. కిట్‌లో ఒక్కో విద్యార్థికి 3 జతల ఏకరూప దుస్తులు, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, పాఠ్య పుస్తకాలు, అందిస్తారు. 1 నుంచి 5 వ తరగతి చదువుతున్న విద్యార్థులకు వర్క్‌ బుక్స్... 6 నుంచి పదో తరగతి విద్యార్థులకు నోటు పుస్తకాలు, బ్యాగు ఇస్తామని వెల్లడించారు.

స్టూడెంట్ కిట్లు సరైన సైజుల్లో రాకపోయినా... పంపిణీ సమయానికి అందుబాటులో లేకపోయినా విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. విషయాన్ని స్థానిక ప్రధానోపాధ్యాయుల దృష్టికి లేదా... 912129051,9121296052 హెల్ప్​లైన్ నెంబర్లను సంప్రదించాలని సూచించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్య భద్రతా దృష్ట్యా... భౌతిక దూరం పాటిస్తూ ప్రతి పాఠశాలలో వరుసగా మూడు రోజుల్లో... కిట్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

ఇదీ చదవండి:'కొత్త వ్యవసాయ చట్టాలతో రైతులకు నష్టం ఉండదు'

ABOUT THE AUTHOR

...view details