తెలంగాణ

telangana

ETV Bharat / city

అనుకున్న సమయాని కంటే ముందుగానే.. దిల్లీకి ఏపీ సీఎం - సీఎం జగన్ దిల్లీ పర్యటన తాజా వార్తలు

ఏపీ సీఎం జగన్ దిల్లీ పర్యటనలో స్వల్ప మార్పులు జరిగాయి. గతంలో ప్రకటించిన షెడ్యూల్ కన్నా.. 2 గంటల ముందుగానే ముఖ్యమంత్రి దిల్లీకి చేరనున్నారు. ప్రధాని మోదీ సహా కొందరు కేంద్ర మంత్రులతో సీఎం సమావేశమయ్యే అవకాశం ఉంది.

అనుకున్న సమయానికంటే ముందుగానే.. దిల్లీకి ఏపీ సీఎం
అనుకున్న సమయానికంటే ముందుగానే.. దిల్లీకి ఏపీ సీఎం

By

Published : Sep 22, 2020, 2:16 PM IST

ఏపీ ముఖ్యమంత్రి జగన్ దిల్లీ పర్యటన సమయంలో స్వల్ప మార్పు చేసినట్లు.. సీఎంవో తెలిపింది. గతంలో ప్రకటించిన షెడ్యూల్ కన్నా.. 2 గంటలు ముందుగానే సీఎం దిల్లీకి వెళ్తారని.. వెల్లడించింది. గన్నవరం విమామాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరిన జగన్​ మరికాసేపట్లో దిల్లీ చేరుకోనున్నారు.

దిల్లీ పర్యటనలో.. ప్రధాని నరేంద్ర మోదీ సహా కొందరు కేంద్రమంత్రులతో సీఎం సమావేశమయ్యే అవకాశం ఉంది. ముఖ్యమంత్రితో పాటు.. అడ్వకేట్ జనరల్ సహా ఇతర ఉన్నతాధికారులు దిల్లీ వెళ్లనున్నారు.

ABOUT THE AUTHOR

...view details