AP CM JAGAN DELHI TOUR: నేడు దిల్లీకి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి - నేడు దిల్లీకి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి
10:40 April 05
AP CM JAGAN DELHI TOUR: నేడు దిల్లీకి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి
AP CM JAGAN DELHI TOUR: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి రెండు రోజుల పర్యటనలో భాగంగా నేడు దిల్లీకి వెళ్లనున్నారు. సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని, రాత్రి కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలవనున్నారు. వారి అపాయింట్‌మెంట్లు దాదాపు ఖరారు అయినట్లు ముఖ్యమంత్రి కార్యాలయవర్గాల సమాచారం. రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటు అవసరం గురించి.. 26 జిల్లాల ఏర్పాటు విషయాన్ని సీఎం ప్రధాని దృష్టికి తీసుకువెళ్లే అవకాశం ఉందని తెలిసింది. పోలవరం, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన గ్రాంట్ల వంటి అంశాలతో పాటు విభజన చట్టంలోని అపరిష్కృత హామీల అమలుపైనా జగన్ ప్రధానితో చర్చిస్తారని అంటున్నారు.
ప్రజాకర్షక పథకాలతో కొన్ని రాష్ట్రాలు ఆర్థిక క్రమశిక్షణను పాటించడం లేదని కేంద్రంలోని వివిధ విభాగాల కార్యదర్శులు ఈ నెల 2న ప్రధాని నరేంద్రమోదీ నిర్వహించిన సమావేశంలో వెల్లడించిన విషయం కూడా చర్చకు రావచ్చన్న వాదన ఉంది. ఈ నేపథ్యంలో ఏపీ పరిస్థితి ఏంటనే అంశం కూడా ప్రస్తావనకు రావచ్చని అంటున్నారు. మంగళవారం రాత్రి ముఖ్యమంత్రి దిల్లీలోనే బస చేయనున్నారు. బుధవారం ఉదయం అందుబాటులో ఉండే కేంద్రమంత్రులను కలిసి.. తిరిగి రానున్నారు.
ఇదీ చూడండి: KCR Delhi Tour Updates : సీఎం కేసీఆర్‌కు దిల్లీలో దంత చికిత్స
TAGGED:
AP CM JAGAN DELHI TOUR