తెలంగాణ

telangana

ETV Bharat / city

నేడు దిల్లీకి ఏపీ సీఎం జగన్.. ప్రధానితో భేటీ! - ప్రధానితో సీఎం జగన్ భేటీ

ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి జగన్ మంగళవారం దిల్లీకి వెళ్లనున్నారు. ప్రధాని మోదీ సహా పలువురు కేంద్రమంత్రులతో భేటీ అయ్యే అవకాశముంది.

ap cm-jagan-tour-delhi-tomorrow-will-meet-central-minister
నేడు దిల్లీకి ఏపీ సీఎం జగన్.. ప్రధానితో భేటీ!

By

Published : Sep 21, 2020, 10:22 PM IST

Updated : Sep 22, 2020, 4:59 AM IST

ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి జగన్ మంగళవారం దిల్లీకి వెళ్లనున్నారు. ప్రధాని మోదీ సహా పలువురు కేంద్రమంత్రులతో భేటీ అయ్యే అవకాశముంది. మధ్యాహ్నం మూడు గంటలకు అమరావతి నుంచి బయల్దేరనున్న జగన్‌.. సాయంత్రం ఐదు గంటలకు దిల్లీకి చేరుకోనున్నారు. వెంటనే రాత్రిలోపు పలువురు కేంద్రమంత్రులతో భేటీ అయ్యే అవకాశాలున్నట్టు ఏపీ భవన్‌ వర్గాలు చెబుతున్నాయి.

కేంద్రమంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్‌, హర్షవర్ధన్‌ను కలవనున్న జగన్‌... రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పోలవరం బకాయిలు, కొవిడ్ పోరులో అదనపు నిధులు కోసం విజ్ఞప్తి చేయనున్నట్టు తెలుస్తోంది. వీటితో పాటు రాజకీయాంశాలపై చర్చ జరిగే అవకాశమున్నట్టు సమాచారం. పార్లమెంట్‌లో జరుగుతున్న పరిణామాలతోపాటు... రాష్ట్రంలో ఆలయాలపై జరుగుతున్న దాడుల విషయంలో సీఎం వివరణ ఇచ్చే అవకాశమున్నట్టు తెలుస్తోంది.

ఇదీ చదవండి :నోరు మెదపలే: ఆ నలభై లక్షలు ఎక్కడ దాటినట్టు?

Last Updated : Sep 22, 2020, 4:59 AM IST

ABOUT THE AUTHOR

...view details