తెలంగాణ

telangana

ETV Bharat / city

తెలంగాణ వాదనలను దీటుగా తిప్పికొడదాం : ఏసీ సీఎం జగన్​

సాగునీటి ప్రాజెక్టులపై తెలంగాణ వాదనలను దీటుగా తిప్పికొట్టాలని జలవనరులశాఖ అధికారులను ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశించారు. త్వరలో జరిగే అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం అజెండాపై సమీక్ష నిర్వహించిన సీఎం.. గట్టిగా వాదనులు వినిపించాలని నిర్దేశించారు.

jagan
jagan

By

Published : Oct 3, 2020, 6:55 AM IST

తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారానికి కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ ఆధ్వర్యంలో ఈనెల 6న జరిగే అపెక్స్ కౌన్సెల్‌ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై అధికారులతో ఏపీ సీఎం జగన్‌ సన్నాహక సమావేశం నిర్వహించారు. అజెండా వారీగా అంశాల్ని జలవనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ ప్రజెంటేషన్‌ రూపంలో వివరించారు. రాష్ట్రం ప్రస్తావించాలనుకునే అంశాలను వింటూనే కొన్ని సందేహాలు వ్యక్తం చేసిన సీఎం తన అభిప్రాయాలు చెప్పారని రాష్ట్రం తరఫున బలంగా వాదనలు వినిపించాలని.. నిర్దేశించినట్లు తెలిసింది.

తెలంగాణ వాదనలను దీటుగా తిప్పికొడదాం : ఏసీ సీఎం జగన్​

అనుమతులు అవసరం లేదు

తెలంగాణ లేవనెత్తబోయే అంశాలకు దీటుగా ఎలా బదులివ్వాలో ప్రజెంటేషన్‌ సిద్ధం చేసినట్లు సమాచారం. ప్రధానంగా రాయలసీమ ఎత్తిపోతల అనేది కొత్త ప్రాజెక్టు కాదని, కేంద్ర కమిటీ కూడా ఇదే అంశాన్ని స్పష్టం చేసినందున పర్యావరణ అనుమతులు అక్కర్లేదని స్పష్టం చేయనున్నారు. అసలు రాయలసీమ ఎత్తిపోతల కింద కొత్త ఆయకట్టే లేదని, తమకు కేటాయించిన నీటినే వాడుకునే క్రమంలో సమస్యే లేదనే విషయాన్నివెల్లడించనున్నారు.

ఆ ప్రాజెక్టులపై ఏం చర్యలు తీసుకున్నారు

ఇక పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం కొత్తగా నిర్మిస్తుంటే ఇప్పటి దాకా బోర్డులు గానీ, కేంద్రంగానీ ఎలాంటి చర్యలు తీసుకున్నాయో చెప్పాలని ఏపీ డిమాండ్‌ చేయబోతోంది. అపెక్స్ కౌన్సిల్‌ తొలి సమావేశంలో దీనిపై అభ్యంతరం లేవనెత్తామని, నిర్మాణం కొలిక్కి వస్తున్నప్పటికీ తేల్చలేదని ఆక్షేపించనున్నారు. కేంద్రప్రభుత్వం మొదట కృష్ణా, గోదావరి నదీ యాజమాన్యబోర్డులను నోటిఫై చేసి జ్యురిస్‌డిక్షన్‌ ప్రకటిస్తే సగం సమస్యలు పరిష్కారం అవుతాయని స్పష్టం చేయనున్నారు.

కృష్ణా బోర్డును బెజవాడకు మార్చండి..

బోర్డులు పోస్ట్‌మ్యాన్‌ పాత్ర తప్ప ఏమీ చేయట్లేదని చెప్పనున్నారు. బోర్డు ఆదేశాలు అమలు చేయకపోవడం విద్యుదుత్పత్తి వల్ల శ్రీశైలంలో నీటి మట్టాలు పడిపోయి రాయలసీమకు ఎంత నష్టం వాటిల్లిందీ వివరించాలనే యోచనలో ఉన్నారు. ప్రాజెక్టుల డీపీఆర్​లు ఇవ్వడానికి తమకు అభ్యంతరం లేదని, అయితే విభజన చట్టంలోనే ప్రస్తావించిన వాటిని ఇప్పుడు కొత్తవిగా పేర్కొంటూ అడగడంలో అర్థంలేదని చెప్పబోతున్నారు. కృష్ణాబోర్డు కార్యాలయాన్నీ తక్షణమే బెజవాడకు మార్చాలని కోరనున్నారు.

ఇదీ చదవండి :కేంద్రం నిర్లిప్తత వల్లే తెలంగాణకు అన్యాయం: సీఎం కేసీఆర్​

ABOUT THE AUTHOR

...view details