Jagan in Sankranti Celebrations: ఏపీలో భోగి సంబరాలు అంబరాన్ని అంటాయి. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం నివాసం సమీపంలోని గోశాల వద్ద సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో సీఎం జగన్ దంపతులు పాల్గొన్నారు. సంక్రాంతి పండుగ ప్రజలందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని ముఖ్యమంత్రి జగన్ ఆకాంక్షించారు. అందరికీ శుభాలు కలగాలని కోరుకున్నారు. పల్లె వాతావరణం తలపించేలా చేసిన ఏర్పాట్లను ముఖ్యమంత్రి, ఆయన సతీమణి భారతి ఆసక్తిగా చూశారు. సంక్రాంతి పాటలకు నృత్యాలు చేసిన కళాకారులు, పాటలు పాడిన గాయకులు మంగ్లీ, ఇంద్రావతి చౌహాన్‌ను అభినందించారు.
Jagan in Sankranti Celebrations: సంక్రాంతి సంబరాల్లో ఏపీ సీఎం జగన్ దంపతులు
Jagan in Sankranti Celebrations: తెలుగు ప్రజలకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఏపీలోని గుంటూరు జిల్లా తాడేపల్లిలో సంప్రదాయబద్ధంగా నిర్వహించిన సంక్రాంతి వేడుకల్లో సీఎం జగన్ దంపతులు పాల్గొన్నారు. సంక్రాంతితో ప్రతి ఇంటా ఆనందాలు వెల్లి విరియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు జగన్ తెలిపారు.
Jagan
మన సంస్కృతి, సంప్రదాయాలకు, సొంత గ్రామాలపై మమకారానికి ఈ పండుగ నిదర్శనమన్నారు. వ్యవసాయానికి, రైతులకు మనమంతా ఇచ్చే గౌరవానికి ప్రతీకగా అభివర్ణించారు. భోగి మంటలు, రంగవల్లులు, పండుగ తెచ్చే సంబరాలతో.. ప్రతి ఇంటా ఆనందాలు వెల్లివిరియాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.
ఇదీచూడండి:KCR Sankranti wishes: 'ప్రజలు సిరిసంపదలు, భోగభాగ్యాలతో తులతూగాలి'