ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ అక్రమాస్తుల కేసులో ఇప్పటికే ఏడు ఛార్జ్‌షీట్లు దాఖలు చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మరో రెండు అభియోగపత్రాలు సమర్పించింది. వాన్ పిక్, లేపాక్షి నాలెడ్జ్ హబ్ కేసుల్లో..... ఈడీ ఇటీవల ఛార్జ్‌షీట్లను కోర్టుకు సమర్పించింది. జగన్ సహా పలువురిపై అభియోగాలను పేర్కొంది. వాన్‌పిక్, లేపాక్షి నాలెడ్జ్ హబ్ ప్రాజెక్టుల్లో అక్రమాలు జరిగాయని.. సీబీఐ(CBI) గతంలో తేల్చింది. వాటికి సంబంధించిన అక్రమ లావాదేవీల చెలామణిపై సుదీర్ఘ దర్యాప్తు జరిపిన ఈడీ... గతంలోనే పలు ఆస్తులు అటాచ్ చేసింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు చేపట్టిన వాన్‌పిక్ ప్రాజెక్టులో క్విడ్ ప్రొకో జరిగినట్లు సీబీఐ పేర్కొంది. వాన్‌పిక్ కేసులో జగన్, నిమ్మగడ్డ ప్రసాద్ సంస్థలకు చెందిన సుమారు రూ.863 కోట్ల ఆస్తులను 2016లో ఈడీ జప్తు చేసింది.
Jagan assets case: జగన్ అక్రమాస్తుల కేసు.. మరో 2 ఛార్జిషీట్లు దాఖలు - తెలంగాణ వార్తలు
![Jagan assets case: జగన్ అక్రమాస్తుల కేసు.. మరో 2 ఛార్జిషీట్లు దాఖలు Jagan assets case, andhra pradesh cm jagan](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12796921-thumbnail-3x2-jagan-f---copy.jpg)
12:11 August 17
Jagan assets case: జగన్ అక్రమాస్తుల కేసు.. మరో 2 ఛార్జిషీట్లు దాఖలు
జగన్‌కు చెందిన సుమారు రూ.538 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. వాన్ పిక్ భూములతో పాటు.. నిమ్మగడ్డ కంపెనీలకు చెందిన రూ.325 కోట్ల విలువైన ఆస్తులను తాత్కాలిక జప్తు చేసింది. అనంతపురం జిల్లా గోరంట్ల, చిలమత్తూరు మండలాల్లో... 8,844 ఎకరాల్లో చేపట్టిన లేపాక్షి నాలెడ్జ్ హబ్‌సెజ్‌లోనూ అక్రమాలు జరిగాయని గతంలో సీబీఐ పేర్కొంది. దీని ఆధారంగా విచారణ జరిపిన ఈడీ... ఇందూ శ్యాంప్రసాద్ రెడ్డికి చెందిన రూ.130 కోట్ల ఆస్తులను అటాచ్ చేసింది.
త్వరలో నిర్ణయం
లేపాక్షి నాలెడ్జ్ హబ్‌కు చెందిన 8వ,844 ఎకరాలతో పాటు కూకట్‌పల్లి ఇందూ టౌన్‌షిప్ భూములను తాత్కాలిక జప్తు చేసింది. వాన్‌పిక్, లేపాక్షి నాలెడ్జ్ హబ్ అంశాలపై దర్యాప్తు పూర్తి చేసిన ఈడీ.. ఇటీవల ఛార్జిషీట్లను సీబీఐ, ఈడీ కోర్టుకు సమర్పించింది. గతంలోనే ఛార్జ్‌షీట్లను దాఖలు చేసినప్పటికీ.. వివిధ సాంకేతిక కారణాలతో కోర్టు వెనక్కి ఇవ్వడంతో.. సరిచేసి ఇటీవల మళ్లీ సమర్పించారు. ఛార్జ్ షీట్లపై త్వరలో కోర్టు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
ఇదీ చదవండి:Visakha Steel Plant: విశాఖ ఉక్కు పరిశ్రమ భవనం ముట్టడి.. వర్షంలోనూ కార్మికుల ఆందోళన