తెలంగాణ

telangana

ETV Bharat / city

సీఎం కంటే ఎన్నికల కమిషనర్ ఎక్కువా?: జగన్​ - ap cm jagan latest news

కరోనా సాకుతో ఎన్నికలు వాయిదా వేస్తున్నట్లు తెలిపిన ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్.. జిల్లాల కలెక్టర్లను ఎలా తొలగిస్తారని సీఎం జగన్ ప్రశ్నించారు. కనీసం సీఎస్​తోగాని వైద్యశాఖ కార్యదర్శితోగాని మాట్లాడకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు.

cm jagan
cm jagan

By

Published : Mar 15, 2020, 4:23 PM IST

ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేశ్​కుమార్​పై ముఖ్యమంత్రి జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రమేశ్​కుమార్ చంద్రబాబు ప్రభుత్వం నియమించిన వ్యక్తి అని ఆరోపించారు. తన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ఆ పదవిని కట్టబెట్టారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల కమిషనర్.. తన ఇష్టానుసారంగా ఆదేశాలు ఇచ్చారని వ్యాఖ్యానించారు.

సీఎం కంటే ఎన్నికల కమిషనర్ ఎక్కువా?: జగన్​

'ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్ ఈరోజు మాట్లాడిన వ్యాఖ్యలు చాలా బాధాకారం. విచక్షణ కోల్పోయి మాట్లాడారు. కులాలు, మతాలకు అతీతంగా పని చేయాలి. కానీ రమేశ్ కుమార్ కరోనా వైరస్ పేరుతో ఎన్నికలు వాయిదా వేశారు. అదే సమయంలో గుంటూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను తప్పిస్తూ ప్రకటన చేశారు. కరోనా సాకు చెప్పి అలా ఎలా చేస్తారు..? ప్రజలు ఓట్లు వేస్తే వైకాపా 151 సీట్లతో అధికారంలోకి వచ్చింది. అధికారం వైఎస్ జగన్​దా...రమేశ్ కుమార్​దా? ఏమైనా అంటే విచక్షణాధికారం అంటున్నారు'

- వైఎస్ జగన్, రాష్ట్ర ముఖ్యమంత్రి

ఇదీ చూడండి:నమస్కారం చేద్దాం... కరోనాను తరిమికొడదాం

ABOUT THE AUTHOR

...view details