AP CM JAGAN BIRTHDAY: ఏపీ సీఎం జగన్‌కు ఎమ్మెల్యే రోజా స్పెషల్ గిఫ్ట్.. - AP CM JAGAN BIRTHDAY: ఏపీ సీఎం జగన్‌కు ఎమ్మెల్యే రోజా బర్త్‌డే గిఫ్ట్.. ఏంటంటే..?
11:22 December 21
AP CM JAGAN BIRTHDAY: ఏపీ సీఎం జగన్‌కు ఎమ్మెల్యే రోజా స్పెషల్ గిఫ్ట్..
AP CM JAGAN BIRTHDAY: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆ పార్టీకి చెందిన నగరి ఎమ్మెల్యే రోజా తన నియోజకవర్గంలో వేడుకలు నిర్వహించారు. కేక్ కట్ చేసి జగన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తాను ఎంతగానో అభిమానించే జగన్‌కు ఓ చిరకాల గిఫ్ట్‌ను ఇచ్చారు. తన నియోజకవర్గంలోని మీరాసాబ్పాలెం గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు.
మీరాసాబ్పాలెంలో ఎవరూ పెద్దగా చదువుకోలేదని.. అందుకే ఈ ఊరిని దత్తత తీసుకుని జగన్ వచ్చే పుట్టినరోజులోపు ఆదర్శ గ్రామంగా మార్చి బహుమతిగా ఇవ్వాలని రోజా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. గతేడాది సైతం ఇలాగే జగన్ జన్మదినం సందర్భంగా ఓ అమ్మాయిని దత్తత తీసుకుని చదివిస్తున్న సంగతి తెలిసిందే.
ఇదీ చూడండి: roja on indigo : ఇండిగో వేధింపులపై కోర్టుకు వెళతాం : ఎమ్మెల్యే రోజా