ఆంధ్రప్రదేశ్ముఖ్యమంత్రి వైఎస్ జగన్తో సినీనటుడు చిరంజీవి భేటీ కానున్నారు. తాడేపల్లిలోని నివాసంలో మధ్యాహ్నం చిరు సహా పలువురు సినీ ప్రముఖులు జగన్‌ను కలవనున్నారు. వీరందరూ మధ్యాహ్నం సీఎంతో కలసి భోజనం చేస్తారు. సైరా నరసింహా రెడ్డి సినిమాకు సంబంధించి అంశమై ముఖ్యమంత్రిని మెగాస్టార్ చిరు కలవనున్నట్లు తెలిసింది. చిరంజీవితో పాటు చిత్ర దర్శకుడు సురేందర్ రెడ్డి సహా ముఖ్య నేతలు పాల్గొనే అవకాశాలున్నాయి. ఇది కేవలం మర్యాదపూర్వక భేటీ మాత్రమేనని చిరంజీవి సహా వైకాపా వర్గాలు తెలిపాయి.
నేడు ఏపీ సీఎం జగన్తో చిరంజీవి భేటీ... ఎందుకంటే? - jagan and chiranjeevi
ఇవాళ మధ్యాహ్నం ఏపీ సీఎం జగన్‌ను మెగాస్టార్ చిరంజీవి కలవనున్నారు. ఈ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఈ సమావేశం మర్యాదపూర్వకమే అని ఇరువర్గాలు చెబుతున్నాయి.
నేడు ఏపీ సీఎం జగన్తో చిరంజీవి భేటీ...సైరా కోసమేనా?
TAGGED:
jagan and chiranjeevi