CID Notice to MP Raghurama : ఆంధ్రప్రదేశ్ నరసాపురం ఎంపీ రఘురాం కృష్ణంరాజును మూడు రోజులపాటు విచారించేందుకు ఏపీ సీఐడీ అధికారుల బృందం హైదరాబాద్ చేరుకుంది. దిల్‌కుషా గెస్ట్‌హౌస్‌లో ఆయనను విచారించనున్నారు. అయితే ఎంపీకి గుండెకు సంబంధించిన అనారోగ్య సమస్య ఉండడంతో సిబ్బంది బృందం వైద్య నిపుణుడి వెంటతీసుకొచ్చారు.
రఘురామకు ఏపీ సీఐడీ నోటీసులు.. విచారణకు హాజరుకాలేనన్న ఎంపీ - CID Notice to MP Raghurama
CID Notice to MP Raghurama : ఏపీ నరసాపురం ఎంపీ రఘురాం కృష్ణంరాజును మూడు రోజులపాటు విచారించేందుకు ఏపీ సీఐడీ అధికారుల బృందం హైదరాబాద్ చేరుకుంది. దిల్‌కుషా గెస్ట్‌హౌస్‌లో ఆయనను విచారించనున్నారు.
CID Notice to MP Raghurama
ముగ్గురు మధ్యవర్తుల సమక్షంలో ఎంపీ రఘురాం కృష్ణంరాజును విచారించాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీంతో తెలంగాణ రాష్ట్రానికి చెందిన డిప్యూటీ తహసీల్దార్, మరొకరి ముందు విచారించాలని నిర్ణయించారు. సీఐడీ డీఐజీ సునీల్ నాయక్ ఆధ్వర్యంలో ఇద్దరు ఎస్పీలు జయసూర్య, గోపాలకృష్ణ, ఇద్దరు సీఐలు.. మరో ఇద్దరు ఎస్సైల సమక్షంలో విచారించనున్నారు. అయితే ఎంపీ రఘురామ కృష్ణం రాజు ఈ రోజు విచారణకు రాలేకపోతున్నానని సీఐడీ అధికారులకు సమాచారం అందించారు.