తెలంగాణ

telangana

ETV Bharat / city

వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి సీఐడీ నోటీసులు

ఏపీలో అధికార ప్రతిపక్ష నేతలకు సీఐడీ నోటీసుల పర్వం కొనసాగుతోంది. తాజాగా వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి నోటీసులు అందాయి.

వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి సీఐడీ నోటీసులు
వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి సీఐడీ నోటీసులు

By

Published : Mar 17, 2021, 9:34 PM IST

వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి సీఐడీ నోటీసులువైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి సీఐడీ నోటీసులు

ఏపీ వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి సీఐడీ నోటీసులు జారీ చేసింది. రేపు (గురువారం) ఉదయం 11 గంటలకు విజయవాడలోని సీఐడీ కార్యాలయానికి రావాలని ఆదేశించింది. అమరావతి భూములకు సంబంధించిన ఆధారాలుంటే చూపాలని పేర్కొంది. ఈ మేరకు సీఆర్​పీసీ సెక్షన్ - 160 కింద నోటీసులు ఇచ్చింది.

ఏపీ రాజధాని ప్రాంతంలో ఎస్సీలకు సంబంధించిన భూముల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని ఎమ్మెల్యే ఆర్కే.. గత నెల సీఐడీకి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన సీఐడీ.. మాజీ సీఎం చంద్రబాబుతో పాటు మాజీ మంత్రి నారాయణకు నోటీసులు జారీ చేసింది.

ఇదీ చూడండి: ఉద్యోగులకు గుడ్​న్యూస్..సభలోనే పీఆర్సీ ప్రకటిస్తానన్న కేసీఆర్

ABOUT THE AUTHOR

...view details