AP CID Raids lakshmi narayana house : మాజీ ఐఏఎస్ లక్ష్మీనారాయణ ఈ నెల 13వ తేదీన విచారణకు హాజరుకావాలని సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ కేసులో ఈరోజు ఉదయం నుంచి హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని లక్ష్మీనారాయణ ఇంట్లో సీఐడీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. పలు పత్రాలు, హార్డ్ డిస్కులు స్వాధీనం చేసుకున్నారు. తనిఖీలకు వచ్చిన సీఐడీ అధికారులను లక్ష్మీనారాయణ మొదట ఇంట్లోకి అనుమతించలేదు. తనిఖీకి గల కారణాలను చూపించాలని కోరారు. ఈ క్రమంలో సీఐడీ అధికారులకు, లక్ష్మీనారాయణ కుటుంబ సభ్యులకు స్వల్ప వాగ్వాదం జరిగింది.
తనిఖీలకు సంబంధించిన నోటీసులు చూపించిన అధికారులు ఇంట్లోకి వెళ్లి సోదాలు నిర్వహించారు. సాయంత్రం సమయంలో లక్ష్మీనారాయణ రక్తపోటు పెరగడంతో కళ్లు తిరిగి పడిపోయారు. వెంటనే కుటుంబ సభ్యులు ఫ్యామిలీ డాక్టర్‌ను ఇంటికి పిలిపించారు. అనారోగ్యంగా ఉన్న కారణంగా ఆస్పత్రిలో చేర్పించాలని ఫ్యామిలీ డాక్టర్ సూచించడంతో... వెంటనే అంబులెన్స్‌లో స్టార్ ఆస్పత్రికి తరలించారు.