ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో.. అంతు చిక్కని వ్యాధితో అస్వస్థతకు గురైన బాధితులను ఏపీ ముఖ్యమంత్రి జగన్ సోమవారం పరామర్శించనున్నారు. ఉదయం తొమ్మిదిన్నర గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి సీఎం బయల్దేరుతారు. ఉదయం 10 గంటల 20 నిమిషాలకు ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకుంటారు. అక్కడ చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శిస్తారు. ఆ తర్వాత అక్కడి జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు.
నేడు ఏలూరుకు సీఎం జగన్.. బాధితులకు పరామర్శ
ఏలూరులో ఏపీ ముఖ్యమంత్రి జగన్ సోమవారం పర్యటించనున్నారు. వందలాది మంది అస్వస్థతకు దారితీసిన కారణాలు, పరిస్థితులను స్వయంగా తెలుసుకోనున్నారు. చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించనున్నారు.
నేడు ఏలూరుకు సీఎం జగన్.. బాధితులకు పరామర్శ
ఏలూరు ఘటనపై ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నానితో మాట్లాడిన ముఖ్యమంత్రి... తక్షణమే తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బాధితులను స్వయంగా పరామర్శించడమే కాకుండా వారికి అందుతున్న చికిత్సను పర్యవేక్షించాలన్నారు. మరోవైపు.. ఘటనకు దారితీసిన కారణాలపై వైద్య ఆరోగ్యశాఖకు చెందిన ఉన్నతాధికారులు పలు పరీక్షలు నిర్వహిస్తున్నారు.
ఇదీ చదవండి:ఏలూరులో ఏం జరుగుతోంది?... ప్రజల అస్వస్థతకు కారణమేంటి?
Last Updated : Dec 7, 2020, 5:49 AM IST