ఏపీ: మరో 10,548 మందికి కరోనా పాజిటివ్
18:43 August 29
ఏపీ: మరో 10,548 మందికి కరోనా పాజిటివ్
ఏపీలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 10,548 మందికి పాజిటివ్ నిర్ధారణ అయినట్లు రాష్ట్ర ప్రభత్వం బులిటెన్ విడుదల చేసింది. ఈ మహమ్మారికి మరో 82 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా పాజిటివ్ కేసులతో కలిపి రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 4,14,164కి చేరగా.. ఇప్పటి వరకు 3,796 మంది మరణించారు.
గత 24 గంటల్లో 8,976 మంది కరోనా నుంచి కోలుకోగా.. మొత్తం 3,12,687 మంది కరోనాను జయించి డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 97,681 క్రియాశీల కేసులు ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం బులిటెన్‌లో వెల్లడించింది.
తాజాగా చిత్తూరు జిల్లాలో 15 మంది, నెల్లూరు జిల్లాలో 11, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో 8 మంది చొప్పున, అనంతపురం, గుంటూరు, కర్నూలు జిల్లాలో ఆరుగురు, ప్రకాశం, విశాఖపట్నం జిల్లాల్లో ఐదుగురు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో నలుగురు, కడప, కృష్ణా జిల్లాల్లో ఇద్దరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు మొత్తం 36,03,345 శాంపిళ్లను పరీక్షించినట్లు ప్రభుత్వం బులిటెన్‌లో పేర్కొంది.
TAGGED:
ap cases