AP Cabinet Meeting: ఈనెల 3న జరగాల్సిన కేబినెట్ సమావేశాన్ని వాయిదా వేస్తూ.. ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశాన్ని 7న నిర్వహించనున్నట్టు సీఎస్ కార్యాలయం జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొంది. మార్చి 7న మధ్యాహ్నం 12 గంటలకు సచివాలయం మొదటి బ్లాక్లో కేబినెట్ సమావేశం జరుగుతుందని స్పష్టం చేసింది. కేబినెట్ సమావేశాలకు సంబంధించిన మార్పులను గమనించాలని అన్ని ప్రభుత్వ శాఖల కార్యదర్శులకు సూచించింది.
దివంగత మంత్రి గౌతమ్ రెడ్డికి సంబంధించి వైదిక కార్యక్రమాల దృష్ట్యా కేబినెట్ సమావేశాన్ని వాయిదా వేసినట్టు తెలుస్తోంది. మార్చి 7 నుంచి శాసనసభ సమావేశాలు నేపథ్యంలో గవర్నర్ ప్రసంగం అనంతరం.. మధ్యాహ్నం 12 గంటలకు కేబినెట్ సమావేశాన్ని నిర్వహించనున్నారు.
AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ సమావేశం వాయిదా.. అందుకేనా? - ap cabinet
AP Cabinet Meeting: ఈనెల 3న జరగాల్సిన ఏపీ కేబినెట్ సమావేశం.. 7వ తేదీకి వాయిదా పడింది. ఈ మేరకు సీఎస్ కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది. సంబంధించిన మార్పులను గమనించాలని అన్ని ప్రభుత్వశాఖలకు సూచించింది.
AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ సమావేశం వాయిదా.. అందుకేనా?