ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు రేపు ప్రారంభం కానున్నాయి. ఇవాళ ఉదయం జరగాల్సిన కేబినెట్ సమావేశం(AP cabinet meeting news) వాయిదా పడింది. కేబినెట్ సమావేశం రేపు ఉదయం జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేబినెట్ భేటీ అయ్యాక అసెంబ్లీకి హాజరుకావాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.
AP assembly sessions: రేపు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం - తెలంగాణ వార్తలు
రేపు ఏపీ శాసనసభ సమావేశాలు (Assembly Session) ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో రేపు ఉదయం కేబినెట్ భేటీ అయి.. తదుపరి అసెంబ్లీకి హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇవాళ ఉదయం 11 గంటలకు సచివాలయం మొదటి బ్లాక్‌లో జరగాల్సిన కేబినెట్ సమావేశం వాయిదా (AP Cabinet Meeting Postponed) పడింది. ఏపీ మంత్రి మండలి సమావేశాన్ని వాయిదా వేసినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయం (CS Office) అత్యవసర నోట్‌ను జారీ చేసింది. కేబినెట్ సమావేశం నిర్వహించే తదుపరి తేదీని త్వరలోనే ప్రకటిస్తామని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు ఏపీ మంత్రులకు, అన్ని శాఖల కార్యదర్శులకు నోట్‌ను సర్క్యులేట్ చేశారు. రేపు శాసనసభ సమావేశాలు (Assembly Session) ప్రారంభం కానున్న నేపథ్యంలో రేపు ఉదయం కేబినెట్ భేటీ అయి.. తదుపరి అసెంబ్లీకి హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.