తెలంగాణ

telangana

ETV Bharat / city

ఏపీ రాజధానిపై జనవరిలో తుది నిర్ణయం - bcg ocmmittee on ap captial news

ఆంధ్రప్రదేశ్​ రాష్ట్ర రాజధాని అంశంపై తుది నిర్ణయం తీసుకునేందుకు మరింత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. రాజధానిని తేల్చేందుకు బోస్టన్​ కన్సల్టింగ్​ గ్రూప్​(బీసీజీ) కమిటీని నియమించింది. ఈ కమిటీ నివేదిక తర్వాతే ఈ అంశంపై స్పష్టత రానుంది. రాజధానిపై జనవరి 3న  బీసీజీ నివేదిక అందజేయనుంది. అనంతరం జనవరి మూడో వారంలో ప్రత్యేక శాసనసభ సమావేశాలు నిర్వహించి అక్కడ ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశముంది.

ఏపీ రాజధానిపై జనవరిలో తుది నిర్ణయం
ఏపీ రాజధానిపై జనవరిలో తుది నిర్ణయం

By

Published : Dec 28, 2019, 6:14 AM IST

Updated : Dec 28, 2019, 7:17 AM IST

ఏపీ రాజధానిపై జనవరిలో తుది నిర్ణయం

ఆంధ్రప్రదేశ్​ రాజధాని తరలింపు అంశంపై మరింత అధ్యయనం చేయాలని ఆ రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. జీఎన్ రావు కమిటీ నివేదికపై చర్చించేందుకు ప్రత్యేకంగా సమావేశమైన మంత్రిమండలి మరికొన్ని ఇతర అంశాలపై సైతం చర్చించి నిర్ణయం తీసుకుంది. బోస్టన్​ కన్సల్టింగ్​ కమిటీని ఏర్పాటు చేసిన సర్కారు.. జీఎన్​ రావు కమిటీ నివేదికతో కలిపి ఈ కమిటీ నివేదికను అధ్యయనం చేసి తుది నిర్ణయం తీసుకోనుంది. ఈ అధ్యయనం కోసం మంత్రులు, అధికారులతో హైపవర్​ కమిటీని ఏర్పాటు చేసినట్లు ఏపీ మంత్రి పేర్నినాని వివరించారు. రాజధాని ప్రకటన చేసే ముందు రైతుల అభిప్రాయాలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏది ఏమైనప్పటికీ జనవరి మూడో తేదీ తర్వాతే రాజధానిపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయనుంది.

ఏపీ కేబినెట్​ నిర్ణయాలివే..

⦁ స్థానిక సంస్థల ఎన్నికల కోసం రిజర్వేషన్ల ఖరారు.. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు మొత్తంగా 59.5 శాతం రిజర్వేషన్లు

⦁ 2020 మార్చిలోగా రూ.130 కోట్లతో కొత్త 108, 104 వాహనాల కొనుగోలుకు కేబినెట్​ ఆమోదం

⦁ రాష్ట్ర వ్యాప్తంగా 341 వ్యవసాయ ఉత్పత్తుల శాశ్వత కొనుగోలు కేంద్రాలను నడపాలని నిర్ణయం

⦁ కనీస మద్దతు ధరకు నోచుకోని పసుపు, ఉల్లి, మిర్చి, చిరు ధాన్యాల కొనుగోలుకు ఆమోదం

⦁ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సీపెట్​కు కృష్ణా జిల్లా సూరంపల్లిలో 6 ఎకరాల భూమిని ఎకరా లక్ష చొప్పున కేటాయించేందుకు నిర్ణయం

⦁ కడప జిల్లా రాయచోటిలో వక్ఫ్​ బోర్డు భవన నిర్మాణం కోసం అనుమతి మంజూరు

⦁ మచిలీపట్నం, రామాయపట్నం పోర్టు నిర్మాణాలకు సంబంధించిన డీపీఆర్​లను మంత్రివర్గం ర్యాటిఫై చేసింది. రూ.11,900 కోట్ల అంచనాతో బందరు పోర్టు, రూ.10,009 కోట్ల అంచనాతో రామాయపట్నం పోర్టు నిర్మాణానికి కేబినెట్​లో నిర్ణయం తీసుకున్నారు.

అవకతవకలపై విచారణ

గత ప్రభుత్వ హయాంలో రాజధాని నిర్మాణంలో అక్రమాలు జరిగినట్లుగా మంత్రివర్గం ఉపసంఘం నివేదిక ఇచ్చిందని.. దీనిపై సీబీఐ, లేదా లోకాయుక్తతో విచారణ చేయించే అంశంపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్లు మంత్రి పేర్నినాని వెల్లడించారు.

భారీ భద్రత

రాజధాని ప్రాంతంలో రైతుల నిరసనల మధ్య నిర్వహించిన రాష్ట్ర కేబినెట్ సమావేశానికి అసాధారణ భద్రతా ఏర్పాట్లు చేశారు. విజయవాడ నుంచి సచివాలయానికి దారితీసే మార్గాలన్నింటినీ పోలీసులు మూసివేశారు. ప్రకాశం బ్యారేజీపై వాహన రాకపోకలను నిలిపివేశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి సచివాలయానికి వచ్చే కాన్వాయ్ మార్గంలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. సీఎం కాన్వాయ్​ కంటే ముందుగానే ఓ ఖాళీ కాన్వాయ్​ను పంపించారు. సచివాలయం సహా హైకోర్టుకు వెళ్లే ఉద్యోగులను సైతం పోలీసులు అడ్డుకున్నారు.

ఇదీ చూడండి:మత్తులోకి దించి.. మట్టుబెడతాడు

Last Updated : Dec 28, 2019, 7:17 AM IST

ABOUT THE AUTHOR

...view details