తెలంగాణ

telangana

ETV Bharat / city

నష్టపోయిన రైతులకు పెట్టుబడి కింద రాయితీ

రైతు భరోసా పథకం, ఏపీ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్ రీసెర్చ్‌ కార్పొరేషన్ ఏర్పాటు ఆర్డినెన్స్‌కు ఆంధ్రప్రదేశ్​ మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ఏపీ సర్వే అండ్‌ బౌండరీ చట్ట సవరణ, నూతన పర్యటక పాలసీని కేబినెట్‌ ఆమోదించింది. సమగ్ర భూసర్వేకు మంత్రివర్గం ఆమోదిస్తూ నిర్ణయం తీసుకుంది. నివర్ తుపాన్ నష్టం, చింతలపూడి ఎత్తిపోతల పథకానికి సంబంధించిన పలు నిర్ణయాలను తీసుకుంది.

ao cabinet decisions
ao cabinet decisions

By

Published : Dec 18, 2020, 4:35 PM IST

ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీ ముగిసింది. పలు కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. కొత్త పర్యటక విధానానికి పచ్చజెండా ఊపింది. కొవిడ్ 19 కారణంగా దెబ్బతిన్న పర్యటక ప్రాజెక్టులకు రీస్టార్ట్ ప్యాకేజీకి ఆమోదం వేయటంతోపాటు... రూ.198.05 కోట్ల పర్యటక ప్రాజెక్టులకు ఆర్థికసాయం చేయాలని నిర్ణయించింది.

మూడో విడత అమలుకు ఆమోదం

ఏపీలో రైతు భరోసా మూడో విడత అమలుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని ఆ రాష్ట్ర మంత్రి పేర్ని నాని తెలిపారు. మూడో విడత కింద రూ.2 వేలు ఆర్థిక సాయం అందుతుందన్నారు. ఇప్పటికే ఈ ఏడాది రూ.12 వేలు చెల్లించామని వివరించారు. డిసెంబర్ 29న రైతుల ఖాతాలో రూ.1,009 కోట్లు జమచేస్తామన్నారు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోయిన రైతులకు పెట్టుబడి రాయితీ అందిస్తామని చెప్పారు. పెట్టుబడి రాయితీని ఒక్క నెలలోనే చెల్లించేలా కొత్త విధానానికి ఆమోదముద్ర వేశామని పేర్కొన్నారు.

నష్టపోయిన రైతులకు పెట్టుబడి కింద రాయితీ

8 లక్షలకుపైగా నష్టపోయారు...

నివర్‌ తుపానుతో 8 లక్షల 6 వేల మంది రైతులు 12లక్షల ఎకరాల్లో పంట నష్టపోయారు. బాధితులందరికీ రూ.719 కోట్లు పెట్టుబడి రాయితీ కింద చెల్లిస్తాం. పశుసంవర్థక శాఖలో 147 ల్యాబ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపారు. పులివెందులలో ఏపీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్‌మెంట్‌ కేంద్రం ఏర్పాటు చేస్తాం. ఏపీ మెడికల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ కార్పొరేషన్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఏపీలో సమగ్ర భూసర్వేకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అక్షాంశాలు, రేఖాంశాల ఆధారంగా భూసర్వే చేపట్టనున్నాం. మూడేళ్లలో భూసర్వే పూర్తిచేసి భూహక్కు పత్రాల జారీ చేస్తాం. ల్యాండ్ రికార్డుల తయారీకి మంత్రివర్గం ఆమోదం వేసింది. తిరుపతి వద్ద 40 ఎకరాల్లో సర్వే అకాడమీ ఏర్పాటు చేస్తాం.
- ఏపీ మంత్రి పేర్ని నాని

చింతలపూడి ఎత్తిపోతల పథకానికి నాబార్డు నుంచి రూ.1,931 కోట్ల రుణం తీసుకోనేందుకు ఏపీ మంత్రివర్గం నిర్ణయించిందని మంత్రి పేర్ని నాని తెలిపారు. ఇందుకోసం జలవనరుల శాఖ అనుమతి ఇచ్చిందన్నారు. ఏపీ అదనపు ఏజీగా జాస్తి నాగభూషణం నియామకానికి కేబినెట్ ఆమోదం వేసిందని చెప్పారు. సినీ పరిశ్రమకూ రీస్టార్ట్ ప్యాకేజీ అమలు చేస్తామన్నారు. 1100 సినిమా థియేటర్లకు రుణాలు, వడ్డీపై రాయితీకి నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు.

నష్టపోయిన రైతులకు పెట్టుబడి కింద రాయితీ

ఇవీచూడండి:కరోనాతో కొలువు కోల్పోయి.. అప్పు చెల్లించలేక ఆత్మహత్య

ABOUT THE AUTHOR

...view details