AMARANATH:అమర్నాథ్ యాత్రకు వెళ్లి గల్లంతైన ఏపీ వాసుల వివరాలను ఏపీభవన్ అధికారులు వెల్లడించారు. గల్లంతైన వారిలో రాష్ట్రానికి చెందిన ఐదుగురు యాత్రికులు ఉండగా అందులో ఒకరు క్షేమంగా ఉన్నారు.
- వినోద్ అశోక్ - విజయవాడ
- గునిశెట్టి సుధ - రాజమహేంద్రవరం
- మధు - తిరుపతి
- ఝాన్సీలక్ష్మి - గుంటూరు
అమరనాథ్ యాత్రకు వెళ్లిన విజయనగరం వాసి నాగేంద్రకుమార్ క్షేమంగా ఉన్నారు. విజయనగరంలోని తమ్ముడికి ఫోన్ చేసి మాట్లాడిన వానపల్లి నాగేంద్రకుమార్.. క్షేమంగా ఉన్నట్లు తెలిపారు. అమర్నాథ్ యాత్రికుల కోసం ఇప్పటికే ఏపీ భవన్లో హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశారు. పూర్తి వివరాలకు హెల్ప్‌లైన్ నెంబర్ 011-23387089ను సంప్రదించాలని అధికారులు తెలిపారు.
మరోవైపు అకస్మిక వరదలు బీభత్సం సృష్టించిన అమర్నాథ్లో సహాయ చర్యలు రాత్రి నుంచి ఉదయం వరకూ కొనసాగాయి. ఇప్పటివరకూ 16 మంది మృతి చెందినట్లు తేలగా.. రాత్రి నుంచి కొనసాగిన సహాయ చర్యల్లో.. కొట్టుకుపోయినట్లుగా భావిస్తున్నవారి మృతదేహాలు లభించలేదని అధికారులు తెలిపింది. ప్రస్తుత అమర్నాథ్కు భక్తులను అనుమతించంలేదు.