తెలంగాణ

telangana

ETV Bharat / city

Ayush On Omicron: 'ఆ మందుకు అనుమతి లేదు.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి'

Ayush On Omicron: ఒమిక్రాన్‌కు ఆయుష్‌శాఖ ఎలాంటి మందునూ అనుమతించలేదని ఆ శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఒమిక్రాన్‌కు ఆయుర్వేద మందు ఇస్తున్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. గుర్తింపులేని మందును ఆయుర్వేద వైద్యంగా భావించవద్దని ప్రజలకు సూచించారు.

ayush on omicron
ayush on omicron

By

Published : Dec 24, 2021, 7:49 PM IST

Ayush On Omicron:ఒమిక్రాన్‌కు ఆయుర్వేద మందు ఇస్తున్నట్లు చేస్తున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవమూ లేదని ఏపీలోని ఆయుష్‌శాఖ స్పష్టం చేసింది. ఒమిక్రాన్‌కు ఆయుష్‌శాఖ ఎలాంటి మందునూ అనుమతించలేదని ఆ శాఖ అధికారులు తెలిపారు. ఆయుర్వేద మందు సరఫరాకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదన్నారు. గుర్తింపులేని మందును ఆయుర్వేద వైద్యంగా భావించవద్దని ప్రజలకు సూచించారు. వైద్యుల సలహాతోనే ఆయుర్వేద, హోమియో మందులు వాడాలన్నారు.

రాష్ట్రంలో 4కు చేరిన ఒమిక్రాన్ కేసులు..

రాష్ట్రంలో ఒమిక్రాన్‌ కేసులు నాలుగుకు చేరాయి. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మహిళకు ఒమిక్రాన్‌ నిర్ధారణ అయినట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. సదరు మహిళ ఈనెల 19న కువైట్‌ నుంచి విజయవాడకు చేరుకుంది. అక్కడినుంచి స్వస్థలం అయినవిల్లి మండలం నేదునూరు వెళ్లింది. ఆమె నమూనాలను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపగా ఒమిక్రాన్‌ నిర్ధారణ అయింది. ఈ మేరకు తూర్పుగోదావరి జిల్లా అదనపు డీఎంహెచ్‌వో వెల్లడించారు. మహిళ భర్త, పిల్లలకు కరోనా నెగెటివ్‌ వచ్చిందని.. మరోసారి వైద్య పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు.

విశాఖలో ఒక ఒమిక్రాన్‌ కేసు నమోదైంది. ఈ నెల 15న దుబాయ్‌ నుంచి వచ్చిన వ్యక్తికి వైరస్ నిర్ధరణ అయ్యింది. బాధితుడి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని అధికారులు వెల్లడించారు. ఒమిక్రాన్‌ సోకిన వ్యక్తిని హోమ్ ఐసొలేషన్‌లో ఉంచినట్లు స్పష్టం చేశారు. మరో 9 మంది నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపినట్లు వైద్యశాఖ వెల్లడించింది. గతంలో నమోదైన 2 కేసులతో కలిపి మెుత్తం కేసుల సంఖ్య 4కు చేరింది.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details