ఆనందయ్య ఔషధం (anadaiah medicine) వల్ల కొవిడ్ తగ్గిందనేందుకు ఆధారం లభించలేదని ఏపీ ఆయుష్ కమిషనర్ రాములు (ayush commissioner ramulu) స్పష్టం చేశారు. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ కార్యదర్శి సింఘాల్‌తో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. పలు ఆసక్తికర విషయాలను ప్రస్తావించారు. ఆనందయ్య ఔషధం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ (side effects), నష్టం జరిగిందనేందుకు ఆధారాలు లేవన్నారు. కంటి చుక్కల మందు వల్ల హాని జరిగిందనేందుకు కూడా ఆధారాలు లేవని తెలిపారు. పూర్తి ఆధారాలకు 3 వారాల సమయం పట్టవచ్చని చెప్పారు. ఔషధంలో 90-95 శాతం పీ, ఎల్, ఎఫ్ రకాలు వినియోగించవచ్చని పేర్కొన్నారు. ఔషధంతో పాటు కొవిడ్ ప్రొటోకాల్ (covid protocol) పాటించాలని సీఎం జగన్ (cm jagan) ఆదేశించారని వివరించారు.
'ఆనందయ్య ఔషధం.. ఆయుర్వేద ఔషధం కాదు. ఔషధాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ఉంది. ఎక్కువ మందికి లబ్ధి కలుగుతుందని నమ్ముతున్నాం. గురువారం కోర్టు వెల్లడించిన నిర్ణయం ఆధారంగా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. ఔషధం విషయమై విధివిధానాలు ఖరారు చేయాల్సి ఉంది. ఔషధంపై చర్చలు జరిపిన తర్వాతే తదుపరి నిర్ణయం తీసుకుంటాం. ఆనందయ్య ఔషధాన్ని ప్రభుత్వం ఆయుర్వేద ఔషధంగా గుర్తించట్లేదు'