ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల(ap assembly session)ను ఈ నెల 18న ఒక్క రోజు నిర్వహించనున్నారు. వచ్చే నెలలో వారం లేదా పదిరోజులపాటు నిర్వహించే అవకాశం ఉంది. నిబంధనల ప్రకారం ప్రతీ ఆర్నెల్లకు ఒకసారి సమావేశం కావాల్సి ఉంది. గత సమావేశాలు జరిగి ఈ నెల 19కి ఆరు నెలలు పూర్తవుతోంది. ఆరు నెలల్లోపు సభను సమావేశ పరచాల్సి ఉన్నందున.. ఒక్క రోజు నిర్వహించాలని నిర్ణయించారు.
ap assembly session: ఆ ఒక్క రోజే అసెంబ్లీ సమావేశాలు.. ఎందుకంటే? - ఏపీ అసెంబ్లీ తాజా వార్తలు
ఏపీ అసెంబ్లీ సమావేశాల(ap assembly session)ను ఈ నెల 18న ఒక్క రోజు మాత్రమే నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. తిరిగి వచ్చే నెలలో వారం లేదా పదిరోజుల పాటు నిర్వహించే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు
ఇక, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవంగా ముగిస్తే.. అసెంబ్లీ సమావేశాల(ap assembly session)ను డిసెంబరు మొదటి వారంలో, అలా కాకుండా పోలింగ్ జరిగితే వచ్చే నెల నాలుగో వారంలో పూర్తి స్థాయిలో నిర్వహిస్తారు. ఈ సమావేశాల్లోనే శాసనమండలి ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికనూ నిర్వహించనున్నారు.
ఇదీ చదవండి:TSRTC MD Sajjanar : ఆర్టీసీ దెబ్బకు దిగొచ్చిన ర్యాపిడో.. అల్లు అర్జున్ యాడ్‌ను ఏం చేశారంటే..?