తెలంగాణ

telangana

ETV Bharat / city

పోలవరంలో స్వీటీ... ఆమె సింప్లిసిటీకి నెటిజన్లు ఫిదా - హీరోయిన్ అనుష్కశెట్టి పోలవరంలో టూర్

అగ్ర హీరోయిన్ అనుష్క ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా పోలవరంలో పర్యటించారు. సన్నిహితులతో కలిసి గోదావరి మధ్యలో ఉన్న మహా నందీశ్వరస్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. స్వీటీ గోదావరి పడవలో నది దాటుతున్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

పోలవరంలో స్వీటీ...
పోలవరంలో స్వీటీ...

By

Published : Dec 9, 2020, 7:35 PM IST

పోలవరంలో స్వీటీ...

సినీ నటి అనుష్క ఆంధ్రప్రదేశ్​లోని పశ్చిమగోదావరి జిల్లా పోలవరం వెళ్లారు. పోలవరం పంచాయతీ పరిధిలోని గోదావరి మధ్యలో ఉన్న మహా నందీశ్వరస్వామి ఆలయంలో పూజలు చేశారు. సన్నిహితులతో కలిసి పడవలో గోదావరి నది దాటిన ఆమె ముఖానికి మాస్కు ఉండటంతో స్థానికులు వెంటనే గుర్తుపట్టలేకపోయారు. గోదావరి దాటుతున్నప్పుడు తీసిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. కాస్ట్యూమ్‌ డిజైనర్‌ ప్రశాంతితో కలిసి స్వీటీ కనిపించారు. చిత్ర పరిశ్రమలో స్టార్‌గా ఉన్నప్పటికీ ఎటువంటి ఆడంబరం లేకుండా ఆమె వచ్చిన తీరు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. అనుష్క సింప్లిసిటీకి మరోసారి అభిమానులు ఫిదా అయ్యారు. అనుష్క తన స్వస్థలం మంగళూరు నుంచి పురుషోత్తపట్నం వచ్చినట్టు తెలుస్తోంది. అక్కడి నుంచి ఆలయానికి వెళ్లారట. అనుష్కకు దైవభక్తి ఎక్కువన్న సంగతి తెలిసిందే.

పోలవరంలో స్వీటీ...

గత ఏడాది ‘సైరా నరసింహారెడ్డిలో మహారాణి ఝాన్సీ లక్ష్మీబాయ్‌గా కనిపించిన అనుష్క ఆపై ‘నిశ్శబ్దంలో నటించారు. హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మాధవన్‌, షాలినీ పాండే, అంజలి, సుబ్బరాజు కీలక పాత్రలు పోషించారు. అనుష్క దివ్యాంగురాలిగా నటించిన ఈ సినిమా అక్టోబరు 2న అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదలైంది. దీని తర్వాత ఆమె తన కొత్త ప్రాజెక్టును ప్రకటించలేదు.

పోలవరంలో స్వీటీ...

ఇదీ చదవండి:తండ్రి లేని అమ్మాయికి పెళ్లి పీటలపైనే కల్యాణలక్ష్మి సాయం

ABOUT THE AUTHOR

...view details