తెలంగాణ

telangana

ETV Bharat / city

అంతర్వేది చక్రస్నానంలో ఆ ఊరివారికి ప్రత్యేకత... ఎందుకంటే?

ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి చక్రస్నానంలో పేరూర్ గ్రామం వారికి ప్రత్యేక స్థానం కల్పిస్తారు. శతాబ్దాల కిందట జరిగిన ఆ సంఘటన ద్వారా నేటికీ ఆ ఊరివారికి ప్రత్యేక స్థానం కల్పించటం ఆనవాయితీగా వస్తోంది. అసలు అప్పుడు ఏం జరిగింది?

anthervedi
అంతర్వేది చక్రస్నానంలో ఆ ఊరివారికి ప్రత్యేకత... ఎందుకంటే?

By

Published : Feb 26, 2021, 10:49 PM IST

ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవంలో భాగంగా నేడు స్వామివారికి చక్రస్నానం నిర్వహించారు. అయితే ఈ ఘట్టంలో పేరూరు వారికి ప్రత్యేక స్థానం కల్పించారు. ఎందుకంటే...

14వ శతాబ్దంలో అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి కల్యాణ చక్రస్నాన ఉత్సవంలో శ్రీవారి చక్ర పెరుమాళ్లు సముద్రగామి అయింది(సముద్రంలో కొట్టుకుపోయింది). అప్పటి మొగల్తూరు మహారాజా వారు ఊరూరా చాటింపు వేయించి తపశ్శక్తితో ఎవరైతే శ్రీ చక్ర పెరుమాళ్లును సముద్రం నుంచి తీసుకు వచ్చి శ్రీవారికి సమర్పిస్తారో వారు కోరింది ఇస్తామని ప్రకటించారు. అప్పటికే స్వామివారి చక్రం విషయం పేరూరు గ్రామంలోని నరసింహ ఉపాసకులయిన బ్రహ్మశ్రీ నేమాని సోమనాథ నరసింహ చైనూలు.. స్వామి వారు స్వప్నంలో కనబడి ఈ కార్యక్రమానికి నువ్వే సమర్థుడవని అన్నారట.

ఆయన మాఘ బహుళ విదియనాడు మొదలుపెట్టిన తపస్సు... వైశాఖ శుద్ధ ఏకాదశి నాటి వరకు కొనసాగింది. ఓ కెరటం ద్వారా స్వామివారి చక్ర పెరుమాళ్లు.. ఆయన చెంతకు చేరిందట. అనంతరం చక్ర పెరుమాళ్లుని ఆయన స్వామివారికి సమర్పించారు. అప్పుడు రాజావారు చైనూలుని.. ఆస్తులు, అంతస్తులు, మణిమాణిక్యాలు ఏమికావాలో కోరుకోమనగా.... ఏమీ వద్దు రాజా.. అంతర్వేది కల్యాణోత్సవాల్లో పేరూరు వారికి ప్రత్యేక స్థానం కల్పించమని కోరారట. అప్పటి నుంచి శ్రీవారి కల్యాణోత్సవంలో పేరూరు వారికి ప్రత్యేకత ఏర్పడింది. శ్రీవారి పెరుమాళ్లును పేరూరు వారే నెత్తిమీద పెట్టుకొని చక్రస్నానం చేయిస్తున్నారు.

ఇవీచూడండి:స్ఫూర్తినిస్తున్న 'శ్రీకారం' పాట.. యష్ 'గజకేసరి' టీజర్

ABOUT THE AUTHOR

...view details